BREAKING
జహీరాబాద్ సిద్ధేశ్వర స్వామి దేవస్థానంలో మూడు రోజుల ఆధ్యాత్మిక మహోత్సవం! సహాయక చర్యలపై ఎమ్మెల్యే గిడ్డు సత్యనారాయణ పర్యవేక్షణ కట్టంగూరును తక్షణమే కరువు మండలంగా ప్రకటించాలి డాక్టర్ నలగాటి ప్రసన్నరాజు మృతుడి కుటుంబానికి కంటారెడ్డి తిరుపతి రెడ్డి గారు ఆర్థిక సాయం. లబ్ధిదారులకు మరింత భరోసా సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ కుందుర్పిలో తెలుగుదేశం పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రచారం. ఎంబిబిఎస్ సీటు సాధించిన లహరికకు అభినందించిన మాజీ మంత్రి హరీష్ రావు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ దంపతులు. సర్కార్ భూమి జోలికొస్తే అంతే అమీన్పూర్ పర్యటనలో కలెక్టర్ హెచ్చరిక 108 కలసల పడిపూజ జహీరాబాద్ ఏఎంసీ చైర్మన్ పదవి ముస్లిం అభ్యర్థికి కేటాయించాలి వాడపల్లి ఇసుక రాంప్ వద్ద రెండు బోట్లు సీజ్ గౌతమ్ నగర్‌లో పొంగిపొర్లుతున్న డ్రైనేజీ గోవాడ లో తెదేపా ఎన్నికల ప్రచారం.. లౌకిక విధానంతో ముందుకు సాగుదాం

అభివృద్దే మా అభిమతం, ఎజెండా..

Select Suryaa Now
అభివృద్దే మా అభిమతం, ఎజెండా..

అభివృద్దే మా అభిమతం, ఎజెండా..! 
ఎంపీ లావు, ఎమ్మెల్యే జూలకంటి 
మున్సిపాలిటి పరిధిలో విస్తృత ప్రచారం..!
మాచర్ల మేజర్ న్యూస్ : అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండి, ఫ్యాక్షన్ కోరల్లో చిక్కుకొని తల్లడిల్లుతున్న మాచర్ల నియోజకవర్గ సర్వతోముఖాభివృద్దే తమ అభిమతం, ఎజెండా అని నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పునరుద్ఘాటించారు. గురువారం మున్సిపాలిటీలో సుడిగాలి పర్యటనతో విస్తృత స్థాయిలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ముందుగా శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, 30 వార్డు నందు కూటమి పార్టీల కౌన్సిలర్ అభ్యర్థులు, చైర్పర్సన్ అభ్యర్థి యెనుముల సుష్మా కేశవరెడ్డి తో కలిసి ఎంపీ, ఎమ్మెల్యే టిడిపి ప్రచార రథంపై రోడ్ షో నిర్వహించారు. అనంతరం 31,32,33,34 వార్డుల నందు ఇంటింటికి తిరిగి, కూటమి ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి పనులు అందించిన సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరించారు. నవంబర్ 1 తేదీన జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి, కూటమి పార్టీల అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎంపీ లావు, ఎమ్మెల్యే జూలకంటి, చైర్పర్సన్ అభ్యర్థి సుష్మా కేశవరెడ్డిలు అభ్యర్థించారు. ఈ సందర్భంగా మీడియాతో వారు మాట్లాడుతూ.., రెండేళ్లన్నరేళ్ళ పాలనలో రూ.260 కోట్లతో మాచర్ల మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు చేపట్టామని, ఇచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. చేస్తున్న అభివృద్ధిని చూసి ఓటర్ల విజ్ఞతతో కూటమి అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు. అలానే పట్టణంలో అమృత్ స్కీమ్, సీసీ రోడ్లు డ్రైన్ల నిర్మాణాలు, పట్టణ బైపాస్ పనులు వంటివి శరవేగంగా పూర్తి చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో నియోజకవర్గంలో ఫ్యాక్షను తరిమి కొడుతున్నామని, అరాచకాన్ని సహించేది లేదని తేల్చి చెప్పారు. ప్రజలు మాచర్లలో జరుగుతున్న మార్పును గమనిస్తున్నారని, స్థానిక ఎన్నికల్లో కూటమికి ప్రజలు పట్టం కడుతున్నారని జోష్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ధారునాయక్, మంజుల రెడ్డి, యాగంటి మల్లికార్జునరావు, రాజబోయిన మధు,మధార్ సాహెబ్, గుండాల శ్రీను, కేశవరెడ్డి, రామాంజిరెడ్డి, అక్కిరెడ్డి, కొమెర దుర్గారావు,మోసిన్, అన్వర్, జాకీర్ తదితరులు పాల్గొన్నారు.