గొట్టల గడ్డ తాండలో హనుమాన్ దేవాలయ ప్రారంభోత్సవానికి పట్నం మహేందర్ రెడ్డి కి ఆహ్వానం
గొట్టల గడ్డ తాండలో హనుమాన్ దేవాలయ ప్రారంభోత్సవానికి పట్నం మహేందర్ రెడ్డి కి ఆహ్వానం
కందుకూరు: కందుకూరు మండలంలోని సార్ల రావులపల్లి గ్రామపంచాయతీ పరిధి గుట్టల గడ్డ తాండలో నూతనంగా నిర్మించిన శ్రీ హనుమాన్ దేవాలయం ప్రారంభోత్సవం, ధ్వజస్తంభ ఆవిష్కరణ కార్యక్రమాలకు హాజరుకావాలని శాసనమండలి సభ్యులు పట్నం మహేందర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ ఏనుగు జంగారెడ్డి లను సర్పంచ్ విస్లావత్ శ్రీనివాస్ ఆహ్వానించారు. నవంబర్ 2 నుంచి 5వ తేదీ వరకు దేవాలయ ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నవంబర్ 5న జరిగే ప్రత్యేక కార్యక్రమాలకు హాజరుకావాలని ఆహ్వాన పత్రిక అందజేశారు. అనంతరం నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు.దేవాలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని పట్నం మహేందర్ రెడ్డి హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కృష్ణ నాయక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రాణా ప్రతాప్ రెడ్డి, బాలు నాయక్, రాజు నాయక్, శ్రీను నాయక్ తదితరులు పాల్గొన్నారు.
టి శ్రీనివాస్, మేజర్ న్యూస్.