BREAKING
ఫ్రిజ్‌లో ఏ ఆహార పదార్థాన్ని ఎన్ని రోజులు నిల్వ ఉంచాలి? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు? బీజేవైఎం దేవరుప్పుల మండల అధ్యక్షుడిగా మూడ అన్వేష్ నాయక్ ఆరోగ్యానికి సంజీవని నువ్వులు.. చిన్న గింజల్లో దాగున్న అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు టీమ్ ఇండియాపై సరికొత్త చరిత్ర సృష్టించిన మిచెల్ సాంట్నర్.. అత్యధిక వికెట్ల వీరుడిగా రికార్డు బూరుగుపేట గ్రామపంచాయతీని తనిఖీ చేసిన డి ఎల్ పి ఓ శ్రీధర్ రావు ఆరోగ్యానికి శ్రీరామరక్ష కివీ పండు.. చిన్న ఫలంలో ఇన్ని అద్భుతమైన పోషకాలు! చిట్యాల ను కరువు మండలంగా ప్రకటించాలి ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ: చివరి ఎనిమిది నిమిషాల్లో అద్భుతం చేసిన భారత్, హ్యాట్రిక్ విజయం సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి... సురక్షిత రవాణాకు సైబరాబాద్ మూవ్స్–2026 నవంబర్ 26 నుంచి టీ-హబ్‌లో ప్రత్యేక కార్యక్రమం కడారి శంకర్ ను పరామర్శించిన డాక్టర్ తాటికొండ రాజయ్య మియాపూర్ భూములు పరిశీలించిన రంగారెడ్డి కలెక్టర్ నారాయణ రెడ్డి రూ.4.63 కోట్లతో అభివృద్ధి పనులకు..... ఎమ్మెల్యే గాంధీ,మాజీ కార్పొరేటర్ రాగం శంకుస్థాపన వెంకటాపురం పిఎస్ ను తనిఖీ చేసిన ఎస్పీ యండమూరి ప్రశంసలు అందుకున్న ‘హైబ్రిడ్ ఫిల్మ్ మేకింగ్’

ఒంగోలులోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ.వి.హర్షవర్ధన్ రాజు

Select Suryaa Now
ఒంగోలులోని  పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ.వి.హర్షవర్ధన్ రాజు

ఒంగోలు, మేజర్‌న్యూస్‌ :

ఒంగోలు నగరపాలక సంస్థతో పాటు అద్దంకి, చీమకుర్తి పురపాలక సంఘాలకు 01-11-2026న పోలింగ్, 03-11-2026న ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా పోలీసు శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేపట్టింది. జిల్లా ఎన్నికల అధికారి, రిటర్నింగ్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ గారు తెలిపారు.

అందులో భాగంగా గురువారం జిల్లా ఎస్పీ గారు ఒంగోలులోని సెయింట్ జేవియర్ స్కూల్, పేర్లమెట్ట వద్ద ఉన్న జడ్పీహెచ్‌ఎస్ పాఠశాల, ఇస్లాంపేటలోని డాన్ బాస్కో ఐటీఐ, అగ్రహారంలోని అంగన్‌వాడీ పాఠశాల, వెంగముక్కలపాలెంలోని జడ్పీహెచ్‌ఎస్ పాఠశాల తదితర పోలింగ్ కేంద్రాలను సందర్శించి, అక్కడ చేపట్టిన భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. మూడు ప్రదేశాలలో 122 వార్డులు, పోలింగ్ లొకేషన్స్ 104, నార్మల్ 53,సెన్సిటివ్ .32, హెపర్ సెన్సిటివ్ 19 ఉన్నాయి. రూట్ మొబైల్ -33, స్ట్రైకింగ్ ఫోర్సులు, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సులు ఉన్నాయి.

ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను సంబంధిత పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లతో పాటు సీసీటీవీ కెమెరాలు, వీడియోగ్రఫీ, పోలింగ్ స్టేషన్ పరిసర ప్రాంతాలను డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ చేపట్టాలని, శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని, ఓటర్లు ఎటువంటి భయం, ఒత్తిడి లేకుండా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించాలని పోలీసు అధికారులకు స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా జరిగేలా పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ గారు ఆదేశించారు.

ఈ సందర్భంగా ఎన్నికల బందోబస్తు ప్రణాళిక, సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు, శాంతిభద్రతల పరిరక్షణ, ముందస్తు నివారణ చర్యలు, పోలీస్ సిబ్బంది విధుల నిర్వహణ తదితర అంశాలపై అధికారులకు జిల్లా ఎస్పీ గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు.

పోలింగ్ రోజున 950 మందికి పైగా పోలీసు సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటారని తెలిపారు. అతి సున్నిత, సున్నిత పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు బలగాలను మోహరిస్తామని, మొబైల్ పార్టీలు, స్ట్రైకింగ్ ఫోర్సులు నిరంతరం గస్తీ నిర్వహిస్తాయని చెప్పారు. స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ కేంద్రాల వద్ద 24 గంటల భద్రత కల్పిస్తామని స్పష్టం చేశారు.

పల్లె నిద్ర 457, కార్డాన్ సెర్చ్ -179, ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన వారిపై 12 కేసులు, ఎక్సైజ్ 40 కేసులు 136.82 లీటర్ల దాని విలువ సుమారు రూ.99,436/-,చెడు నడతగల వ్యక్తులు (రౌడీషీటర్లు), గతంలో ఎన్నికల అల్లర్లకు పాల్పడిన వ్యక్తులపై నిరంతరం నిఘా కొనసాగుతోందన్నారు.

పోలింగ్‌కు 48 గంటల ముందు ప్రచార గడువు ముగుస్తుందని ఎస్పీ గారు తెలిపారు. ప్రచార గడువు ముగిసిన తర్వాత బహిరంగ సభలు, ఊరేగింపులు, లౌడ్‌స్పీకర్ల వినియోగం, గుంపులుగా ప్రచారం నిర్వహించడం నిషేధమన్నారు. సంబంధిత పురపాలక సంఘాల ఓటర్లు కాని రాజకీయ నాయకులు, కార్యకర్తలు ప్రచార గడువు ముగిసిన వెంటనే ఆయా పట్టణాల పరిధిని విడిచి వెళ్లాలని సూచించారు. పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల పరిసరాల్లో అమలులో ఉన్న నిషేధాజ్ఞలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.

ఓటర్లకు నగదు, మద్యం, ఇతర ప్రలోభాలు పంపిణీ చేయడం, ఓటర్లను బెదిరించడం, దొంగ ఓట్లు వేయడం, బూత్ ఆక్రమణకు పాల్పడడం, ఆయుధాలు తీసుకెళ్లడం, సామాజిక మాధ్యమాల్లో తప్పుడు లేదా రెచ్చగొట్టే సమాచారాన్ని ప్రచారం చేయడం చట్టరీత్యా నేరాలని ఎస్పీ గారు హెచ్చరించారు.

అభ్యర్ధులు, ఓటర్లు, ఏజెంట్లు ఎన్నికల నియమావళిని (MCC), R.O అధికారి గారి యొక్క ఉత్తర్వులు తప్పనిసరిగా పాటించాలన్నారు. ఎలక్షన్ నియమావళి ప్రకారం పోలింగ్ కేంద్రాల వద్ద 163 BNSS సెక్షన్ (144 సెక్షన్),30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటున్నందన్నారు. పోలింగ్ కేంద్రాలకు 100మీ దూరం  వరకు ఎవరు గుంపులు గుంపులుగా ఉండరాదన్నారు.

ఎన్నికల సమయంలో బెదిరింపులు, ప్రలోభాలు లేదా శాంతిభద్రతలకు సంబంధించిన సమస్యలు ఎదురైతే డయల్ 100/112 కు సమాచారం అందింస్తే తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ గారు అన్నారు.

జిల్లా ఎస్పీ గారి పోలింగ్ స్టేషన్ సందర్శించిన సమయంలో అడిషనల్ ఎస్పీ యన్.యుగంధర్ బాబు, ఒంగోలు డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు,ఒంగోలు టౌన్ సీఐ లు విజయకృష్ణ, వీర నాయక్, వెంకటేశ్వరరావు, ఎస్సైలు మరియు సిబ్బంది ఉన్నారు.