పట్టణ సమగ్ర అభివృద్ధికి కూటమి అభ్యర్థులకు మద్దతివ్వాలి - ఎమ్మెల్యే ముత్తుముల
గిద్దలూరు, మేజర్‌న్యూస్:
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా గౌరవ ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు 11వ వార్డు అభ్యర్థి నటుకుల శ్వేతలత, 12వ వార్డు అభ్యర్థి షేక్ ముభినా గార్ల తరఫున ఇంటింటి ప్రచారం నిర్వహించి సైకిల్ గుర్తు పై ఓటువేసి వేయించి అత్యధిక మెజారిటీ తో గెలిపించుకోవాలి అని ఓటర్లకు కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గిద్దలూరు పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కూటమి అభ్యర్థులకు ప్రజలు మద్దతు ఇవ్వాలని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారు కోరారు. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి జె.వి. నారాయణ గారికి కమలం గుర్తుపై,11 వ వార్డు అభ్యర్థి నటుకుల శ్వేతలత, 12 వ వార్డు అభ్యర్థి షేక్ ముభినా గార్లకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. పట్టణ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి అభ్యర్థులకు ప్రజలు తమ మద్దతు తెలియజేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు అభిమానులు తదితరులు భారీగా పాల్గొన్నారు