BREAKING
ఫ్రిజ్‌లో ఏ ఆహార పదార్థాన్ని ఎన్ని రోజులు నిల్వ ఉంచాలి? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు? బీజేవైఎం దేవరుప్పుల మండల అధ్యక్షుడిగా మూడ అన్వేష్ నాయక్ ఆరోగ్యానికి సంజీవని నువ్వులు.. చిన్న గింజల్లో దాగున్న అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు టీమ్ ఇండియాపై సరికొత్త చరిత్ర సృష్టించిన మిచెల్ సాంట్నర్.. అత్యధిక వికెట్ల వీరుడిగా రికార్డు బూరుగుపేట గ్రామపంచాయతీని తనిఖీ చేసిన డి ఎల్ పి ఓ శ్రీధర్ రావు ఆరోగ్యానికి శ్రీరామరక్ష కివీ పండు.. చిన్న ఫలంలో ఇన్ని అద్భుతమైన పోషకాలు! చిట్యాల ను కరువు మండలంగా ప్రకటించాలి ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ: చివరి ఎనిమిది నిమిషాల్లో అద్భుతం చేసిన భారత్, హ్యాట్రిక్ విజయం సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి... సురక్షిత రవాణాకు సైబరాబాద్ మూవ్స్–2026 నవంబర్ 26 నుంచి టీ-హబ్‌లో ప్రత్యేక కార్యక్రమం కడారి శంకర్ ను పరామర్శించిన డాక్టర్ తాటికొండ రాజయ్య మియాపూర్ భూములు పరిశీలించిన రంగారెడ్డి కలెక్టర్ నారాయణ రెడ్డి రూ.4.63 కోట్లతో అభివృద్ధి పనులకు..... ఎమ్మెల్యే గాంధీ,మాజీ కార్పొరేటర్ రాగం శంకుస్థాపన వెంకటాపురం పిఎస్ ను తనిఖీ చేసిన ఎస్పీ యండమూరి ప్రశంసలు అందుకున్న ‘హైబ్రిడ్ ఫిల్మ్ మేకింగ్’

ప్రచారంలో దూసుకుపోతున్న కూటమి అభ్యర్థులు

Select Suryaa Now
ప్రచారంలో దూసుకుపోతున్న కూటమి అభ్యర్థులు

డోన్ ( సూర్ ప్రతినిధి  మేజర్ న్యూస్):డోన్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో కూటమి అభ్యర్థులు జోరు పెంచారు. గురువారం పట్టణంలోని 29వ, 33వ వార్డుల్లో ప్రచారం ముమ్మరంగా సాగింది.  ఈ ప్రచారంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే, కూటమి మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి కోట్ల సుజాతమ్మ పాల్గొని 29వ వార్డు టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థి హరీష్ గౌడ్, 33వ వార్డు జనసేన పార్టీ కూటమి కౌన్సిలర్ అభ్యర్థి రేష్మలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.  

ఆప్యాయ పలకరింపులు - ప్రజా సమస్యలపై చర్చ

ప్రచారంలో భాగంగా ఆమె వార్డు ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గతంలో తాను ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో డోన్ నియోజకవర్గ అభివృద్ధికి చేసిన కృషిని, చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రజల అవసరాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ, డోన్ పట్టణాన్ని అన్ని రంగాల్లో మరింత ముందుకు తీసుకెళ్లడమే తన ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా సుజాతమ్మ పేర్కొన్నారు.  

కూటమి అభ్యర్థులను గెలిపించాలని పిలుపు

29వ వార్డు టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థి హరీష్ గౌడ్‌ను సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.33వ వార్డు జనసేన కూటమి కౌన్సిలర్ అభ్యర్థి రేష్మను గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో విజయం చేకూర్చాలని అభ్యర్థించారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.

సూర్య ప్రతినిధి వెంకటేష్ నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం