BREAKING
ఓటు బచావో.. దేశ్ బచావో కార్యక్రమానికి తరలిన కాంగ్రెస్ నాయకులు.. జహీరాబాద్ సిద్ధేశ్వర స్వామి దేవస్థానంలో మూడు రోజుల ఆధ్యాత్మిక మహోత్సవం! సహాయక చర్యలపై ఎమ్మెల్యే గిడ్డు సత్యనారాయణ పర్యవేక్షణ కట్టంగూరును తక్షణమే కరువు మండలంగా ప్రకటించాలి డాక్టర్ నలగాటి ప్రసన్నరాజు మృతుడి కుటుంబానికి కంటారెడ్డి తిరుపతి రెడ్డి గారు ఆర్థిక సాయం. లబ్ధిదారులకు మరింత భరోసా సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ కుందుర్పిలో తెలుగుదేశం పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రచారం. ఎంబిబిఎస్ సీటు సాధించిన లహరికకు అభినందించిన మాజీ మంత్రి హరీష్ రావు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ దంపతులు. సర్కార్ భూమి జోలికొస్తే అంతే అమీన్పూర్ పర్యటనలో కలెక్టర్ హెచ్చరిక 108 కలసల పడిపూజ జహీరాబాద్ ఏఎంసీ చైర్మన్ పదవి ముస్లిం అభ్యర్థికి కేటాయించాలి వాడపల్లి ఇసుక రాంప్ వద్ద రెండు బోట్లు సీజ్ గౌతమ్ నగర్‌లో పొంగిపొర్లుతున్న డ్రైనేజీ గోవాడ లో తెదేపా ఎన్నికల ప్రచారం..

తుఫాన్‌కు కూలిన చెట్టు తొలగింపు

Select Suryaa Now
తుఫాన్‌కు కూలిన చెట్టు తొలగింపు

బాడంగి, సూర్య : అర్నాబ్ తుఫాన్ ప్రభావంతో కురిసిన ఈదురుగాలులకు ఎరుకులపాకల గ్రామంలోని ప్రధాన రహదారి పక్కన ఉన్న తురాయి చెట్టు కూలిపోయింది. రామభద్రపురం నుంచి రాజాం వెళ్లే ప్రధాన రహదారిపై బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడే పరిస్థితి నెలకొంది. విషయాన్ని గుర్తించిన బాడంగి మండల మాజీ ఉపాధ్యక్షుడు, ఏపీ ఎరుకుల సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి పాలవలస గౌరు ఆధ్వర్యంలో గ్రామ యువత, స్థానిక ప్రజలు గురువారం ఉదయం రంగంలోకి దిగారు. రచ్చబండ సమీపంలో రోడ్డుపై అడ్డంగా పడిన  చెట్టును తొలగించి, రాకపోకలకు మార్గం సుగమం చేశారు. సమయస్ఫూర్తితో స్పందించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టిన పాలవలస గౌరు, గ్రామ యువత, స్థానిక ప్రజలను పలువురు అభినందించారు.