BREAKING
ఘనపూర్ వెంకటేశ్వర స్వామి ఆలయ హుండీ ఆదాయం రూ.47,727 పోలీసు అమరవీరులకు ఘన నివాళి.. - గాయత్రి కళాశాల విద్యార్థుల రక్తదానం ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట భద్రతా చర్యలు చేపడుతున్నాము : జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ ఆదర్శనగర్‌లో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఎన్నికల ప్రచారం.. శెట్టూరు వైఎస్ఆర్సిపి ప్రచార జోరు.. ప్రజలతో మమేకమైన ఎమ్మెస్ మహాదేవి. డబిల్‌పూర్‌లో భూ రీ సర్వే పనుల పరిశీలన.. అధికారులకు అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి సూచనలు ఆర్నాబ్ తుఫానుతో అంధకారమైన జీవీఎంసి 106 వ వార్డు జాజులవానిపాలెం సోడిగానిపల్లిలో టీడీపీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం కౌసర్ ను గెలిపించాలని జనసేన జిల్లా అధ్యక్షులు టి సి వరుణ్ విస్తృత ప్రచారం.. 32వ డివిజన్లో ఇంటింటికి వెళ్లి ఓటు అభ్యర్థన విద్యార్థులు పోక్సో చట్టంపై అవగాహన కలిగి ఉండాలి పి.ఓలకు, ఏ.పి.ఓలకు శిక్షణ విజయమే లక్ష్యంగా తిరుపతి 5వ డివిజన్లో తుడా చైర్మన్ సుడిగాలి ప్రచారం సమయపాలన పాటించకుంటే చర్యలు తప్పవు అభివృద్ధి చూసి ఓటు వేయండి - ఎమ్మెల్యే జూలకంటి. మాచర్లలో ఎమ్మెల్యే జూలకంటి, ఎంపీ లావు విస్తృత ప్రచారం

దేపూరులో జడ్పిటిసి, ఎంపీటీసీ అభ్యర్థుల ముమ్మార ప్రచారం

Select Suryaa Now
దేపూరులో జడ్పిటిసి, ఎంపీటీసీ అభ్యర్థుల ముమ్మార ప్రచారం

ఆత్మకూరు, మేజర్ న్యూస్ :    ఆత్మకూరు మండలం దేపూరులో తెలుగుదేశం జడ్పిటిసి అభ్యర్థి డాక్టర్ తుమాటి శశిదర్ రెడ్డి, నువ్వురుపాడు ఎంపీటీసీ టిడిపి అభ్యర్థి షేక్ ఖాజావలి తమ పార్టీ నాయకులతో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దేపూరు లోని అన్ని ప్రాంతాల్లో వారు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు.నువ్వురుపాడు సెగ్మెంట్ పరిధిలోని తెలుగుదేశం నాయకులతో కలిసి డాక్టర్ శశిధర్ రెడ్డి, షేక్ ఖాజావలి గ్రామంలో ప్రచారం నిర్వహించగా విశేష ఆదరణ లభించింది. అందరూ తమను ఆశీర్వదించి, ఆదరించి ఓట్లు వేసి విజయం చేకూరిస్తే మండలంలో అన్ని గ్రామాల అభివృద్ధికి, సెగ్మెంట్ పరిధిలో అభివృద్ధికి తమ వంతుగా ప్రత్యేక శ్రద్ధతో కృషి చేస్తామని ని జడ్పిటిసి మెంబర్ డాక్టర్ శశిధర్రెడ్డి పేర్కొనగా నువ్వు పాడు పరిధిలోని అన్ని గ్రామాల అభివృద్ధికి మౌలిక వస్తువుల కల్పనకు ప్రజల సంక్షేమానికి తాను ప్రత్యేక శ్రద్ధతో కృషి చేస్తానని ఎంపీటీసీ తెలుగుదేశం అభ్యర్థి షేక్ ఖాజావలి పేర్కొన్నారు. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆశీస్సులతో తాము పోటీ చేస్తున్నామని,కూటమి ఆధ్వర్యంలోని తెలుగుదేశం అభ్యర్థులుగా తాము రంగంలో దిగామని, తమకు విజయం చేకూరిస్తే ప్రజల రుణం తీర్చుకుంటామనిz ప్రజలకు అన్ని రకాల సేవలు అందిస్తామని డాక్టర్ శశిధర్ రెడ్డి,ఖాజావలి పేర్కొన్నారు. రామనారాయణ రెడ్డి సహకారంతో మండల, నువ్వురుపాడు సెగ్మెంట్ అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తామని శశిధర్ రెడ్డి, ఖాజావలి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేపూరు నువ్వురుపాడు, అశ్వినిపురం, పాత జంగాలపల్లి గ్రామాల తెలుగుదేశం నాయకులు, కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ప్రచారంలో అన్ని వర్గాల నుండి అభ్యర్థులకు విశేషాధరణ లభించింది.