రాఘవేంద్రుడిని దర్శించుకున్న వైసీపీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్.. ప్రత్యేక పూజలు.. ఆశీర్వదించిన పండితులు
అనంతపురం ప్రతినిధి మేజర్ న్యూస్ :-నగరంలోని ఒకటవ రోడ్డులో ఉన్న రాఘవేంద్ర స్వామి మఠం ఆలయంలో వైఎసఆర్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి సి.రమేష్ గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు. మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్‌తో పాటు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థులు ఇషాక్, చంద్రమోహన్ రెడ్డి, అశోక్ కుమార్ రెడ్డి కలిసి రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్నారు. ఆలయంలో పూజారుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి అనుగ్రహం కోరుకున్నారు. అనంతరం మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ మాట్లాడుతూ.. వైఎసఆర్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థిగా తనను, కార్పొరేటర్ అభ్యర్థులను గెలిపించాలని భక్తులు, ఓటర్లను కోరారు. ప్రజల సమస్యల పరిష్కారానికి, నగరాభివృద్ధికి పార్టీ అంకితభావంతో పని చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, స్థానిక నాయకులు, భక్తులు పాల్గొన్నారు. ఆలయ పూజారులు అభ్యర్థులకు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు.