BREAKING
బొబ్బిలి మున్సిపల్ ఎన్నికలకు ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా కఠిన ఆంక్షలు: మంథనిలో పుష్కర ఘాట్ అభివృద్ధికి రూ.23 కోట్లు... ఆకలి కేకల దిశగా ప్రపంచం? విజయనగరం సమగ్ర అభివృద్ధే లక్ష్యం..... బీఎస్పీ మేయర్ అభ్యర్థిని లింగాల పార్వతికి మద్దతుగా ప్రచార ర్యాలీ ఆర్నబ్ తుఫాన్ తో 56 హెక్టార్లలో వరి, 4 హెక్టార్లలో పత్తి నష్టం: ఏవో రాష్ట్రస్థాయి యోగా పోటీలకు డి. ప్రదీప్ ఎంపిక పల్లె పోరులో... ప్రచారాల హోరు నగరంలో ముమ్మరంగా ఎమ్మెల్యే దగ్గుపాటి సతీమణి శ్రీలక్ష్మి, కుమార్తె అశ్రిత ఎన్నికల ప్రచారం.. 45, 48 డివిజన్లలో ప్రచార కార్యక్రమం.. దగ్గుపాటి శ్రీలక్ష్మి కి మహిళల నుంచి అనూహ్య స్పందన క్లోరినేషన్ పరీక్షలు తప్పనిసరి --ఆరోగ్య విస్తరణ అధికారి : ఎల్ . సుబ్రహ్మణ్యం ఆశీర్వదించండి.... మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తా రూప్ కుమార్ యాదవ్ కు మద్దతుగా మాదిగల ఆత్మీయ సదస్సు కేసీఆర్‌దే హాలిడే.. కాంగ్రెస్ ప్రభుత్వానికి కాదు: ఆది శ్రీనివాస్ 4వ డివిజన్‌లో కూటమి అభ్యర్థులకు మద్దతుగా విస్తృత ప్రచారం పత్తి పంటను పరిశీలించిన శాస్త్రవేత్తల బృందం : 3 వ సెగ్మెంట్ యమ్.పి.టి.సి అభ్యర్థిని గా బొల్లా ఈశ్వరి ప్రచారం

షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రి వర్కర్లకు దుస్తులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే శంకర్

Select Suryaa Now
షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రి వర్కర్లకు దుస్తులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే శంకర్

  ఫరూక్ నగర్ రంగారెడ్డి

*షాద్‌నగర్:* దీపావళి పండుగను పురస్కరించుకుని షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న వర్కర్లకు దీపావళి కానుకగా దుస్తులు పంపిణీ చేశారు. దాత కేకే కృష్ణ అందించిన దుస్తులను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్ చేతుల మీదుగా అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. పండుగలు ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందాన్ని నింపాలని, ప్రజలకు సేవలందిస్తున్న ఆసుపత్రి కార్మికులకు దుస్తులు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్మికుల సేవలు ఎంతో ముఖ్యమైనవని, వారిని గుర్తించి ప్రోత్సహించడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు. సేవాభావంతో ముందుకు వచ్చిన దాత కేకే కృష్ణను అభినందించారు.దీపావళి కానుకలు అందుకున్న వర్కర్లు ఎమ్మెల్యేకు, దాతకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ అలీ ఖాన్, సింగల్ విండో చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, కౌన్సిలర్ సి. పెంటయ్య, మహిళా సంఘం అధ్యక్షురాలు అరుంధతి రెడ్డి, ఆసుపత్రి సూపరింటెండెంట్ విష్ణు వర్ధన్ రెడ్డి, మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుడు సయ్యద్ ఖదీర్, ముబారక్ అలీ ఖాన్, బాలరాజు గౌడ్, దామోదర రెడ్డి, గుట్ట రాజు, లింగారెడ్డి గూడ ఉప సర్పంచ్ అశోక్, మహబూబ్ తదితరులు పాల్గొన్నారు.

నరసింహారెడ్డి మేజర్ న్యూస్