మల్లన్నసాగర్ కట్టకింద భారీ బ్లాస్టింగ్
మల్లన్నసాగర్ కట్టకింద భారీ బ్లాస్టింగ్
•తిప్పారం గ్రామంలో దెబ్బతిన్న ఇండ్లు, గ్రామస్తులు ఆందోళన
•ఘటన స్థలాన్ని పరిశీలించిన మాజీ మంత్రి హరీష్ రావు
•కాంగ్రెస్ ప్రభుత్వం కాలేశ్వరం ప్రాజెక్టు నిర్లక్ష్యం చేస్తుందని ప్రభుత్వంపై ఆగ్రహం
•భారీ బ్లాస్టింగ్ తో మల్లన్న సాగర్ కట్ట ప్రమాదం పొంచి ఉంది
•మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు
కుకునూరుపల్లి, మేజర్ న్యూస్.....సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం తిప్పారం గ్రామం శివారులోని మల్లన్న సాగర్ రిజర్వాయర్ కట్ట కింద జరుగుతున్న బ్లాస్టింగ్ పనులను,దెబ్బతిన్న ఇండ్లను పరిశీలించిన మాజీమంత్రి,బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు, ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, వంటేరు ప్రతాప్ రెడ్డి ఎర్రోళ్ల శ్రీనివాస్,ఈ సందర్భంగా పైప్‌లైన్ల కోసం అనధికారికంగా బ్లాస్టింగ్స్ చేస్తుండటంతో మల్లన్న సాగర్ కట్ట దెబ్బతినే ప్రమాదం ఉందని హరీశ్ రావుకు గ్రామస్తుల ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ
అనధికారికంగా బ్లాస్టింగ్ పనులు చేస్తుండటంపై ఉత్తమ్ కుమార్ రెడ్డికి బహిరంగా లేఖ రాస్తానని స్పష్టం చేశారు. కాళేశ్వరం పై మొదటి నుండి ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది మేడిగడ్డ బ్యారేజ్ రెండు పిల్లర్లు కుంగడం వెనుక బ్లాస్టింగ్ ఉందా, బ్లాస్టింగ్ జరిగిందా అనే అనుమానాలు బలంగా ఉన్నాయి. మల్లన్నసాగర్ కట్టపై కుట్ర చేస్తున్నారని స్పష్టంగా తెలుస్తుంది.కట్టకు రెండు వందల మీటర్ల దూరంలో బ్లాస్టింగ్ చేయడంపై స్థానిక సర్పంచ్ భద్రప్ప నాకు తెలియజేశారు. బ్లాస్టింగ్ కారణంగా గ్రామంలోని ఇండ్లకు ఇబ్బంది ఏర్పడుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.మూసి సుముందరీకరణకు నీళ్లు తీసుకుపోవడానికి ఈ బ్లాస్టింగ్ ను అనధికారికంగా చేస్తున్నారు.
ఈ పైపు లైన్ కోసం భూములు కోల్పోయిన రైతులను గజ్వేల్ ఆర్డీవో, రెవెన్యూ అధికారులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. గ్రామంలో ఉన్న ఇండ్లకే ఇబ్బంది ఉంది రెండు వందల మీటర్ల దూరంలో మల్లన్న సాగరా కట్ట గూర్చి ఆందోళన చేస్తున్నాడు.హైదరాబాద్ సుందరీకరణలో భాగంగా నీళ్ళను తీసుకు పోవడం కోసం బ్లాస్టింగ్ చేస్తున్నారు. ఇరిగేషన్,పోలీస్,గ్రామ పంచాయతీ పర్మిషన్ లేకుండా బ్లాస్టింగ్ చేయడం ఏంటి
16నుండి 20 మీటర్ల లోతు బ్లాస్టింగ్ చేస్తున్నారు.
బ్లాస్టింగ్ తాకిడికి గ్రామంలోని ఇండ్లు పర్రెలు పెట్టీ ఇబ్బంది అవుతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామంలోని కూలీలు, రైతులు కట్టకు ఇబ్బంది అవుతుంది అని బాధపడుతున్నారు
బ్లాస్టింగ్ కోసం గ్రామ సర్పంచ్ పై ఒత్తిడి చేస్తున్నారు.
ఎస్సై, సిఐలు పోలీస్ అధికారులను అడిగితే ఎవరికి తెలియదని చెప్తున్నారు.
HMW బ్లాస్ట్ అదికారులకు లేక రాశామని ఇరిగేషన్ శాఖ అధికారులు చెప్తున్నారు.
ఇవన్నీ చూస్తే మలన్నసాగర్ రిజర్వాయర్ పై కుట్రలు చేస్తున్నారని మాకు అనుమానం వస్తుంది. 16లక్షల ఇరవై మూడు వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేది మల్లన్న సాగర్ రాజకీయాల కోసం కుట్రలు చేయడం బాధాకరం ఏజెన్సీ మీద చర్యలు తీసుకోవాలని, గ్రామంలో నష్ట పోయిన గ్రామస్తులకు నష్ట పరిహారం ఇవ్వాలి.గజ్వేల్ ఆర్డీవో, రెవెన్యూ అధికారుకు బెదిరించి రైతులకు పట్టా,అసైన్డ్ రైతులను బెదిరించి వేరు వేరుగా పరిహారం ఇచ్చారు. రైతులను ఇవి గూడ రావు మీకు డబ్బులు అని భయ బ్రాంతులకు గురి చేసి భూమి తీసుకున్నారు.పది లక్షల పరిహారం ఇవ్వడంపై నష్ట పోయిన రైతులకు న్యాయం చేసేందుకు మేము పోరాడుతాం కట్టకు నియమ నిబంధాలను ఉల్లంఘించి పనులు చేయడం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి బహిరంగ లేఖను కూడా రాస్తాను వెంటనే ప్రభుత్వం స్పందించి పనులను చేసిన బ్లాస్టింగ్ చేసిన వారిపై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.