మంథని పుష్కర ఘాట్‌కు రూ.23 కోట్లు
సూర్య - మంథని: 2027 గోదావరి పుష్కరాల నేపథ్యంలో మంథని పుష్కర ఘాట్ అభివృద్ధికి ప్రభుత్వం రూ.23 కోట్లు మంజూరు చేసిందని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యార్ తెలిపారు. గురువారం అధికారులతో కలిసి ఘాట్‌ను పరిశీలించి పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. కాశీ తరహాలో గోదావరికి సప్త హారతులు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.మంథనిలోని గౌతమేశ్వర స్వామి ఆలయాన్ని రూ.10 కోట్లతో పునర్నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఘాట్ పనులు మార్చి చివరి నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కోయ శ్రీహర్ష, ఇతర అధికారులు పాల్గొన్నారు.