BREAKING
మండల అభివృద్ధికి కృషి చేస్తా...బండి రమణమ్మ..! స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి: జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లి, ఐపీఎస్ తుఫాన్ తో రాష్ట్రానికి రూ 42 కోట్లు ఆస్తి నష్టం భూ వివాదాల పరిష్కారానికి భూముల రి సర్వే. తుఫాన్ బాధితులకు అండగా ఉండాలి ఓటు బచావో.. దేశ్ బచావో కార్యక్రమానికి తరలిన కాంగ్రెస్ నాయకులు.. జహీరాబాద్ సిద్ధేశ్వర స్వామి దేవస్థానంలో మూడు రోజుల ఆధ్యాత్మిక మహోత్సవం! సహాయక చర్యలపై ఎమ్మెల్యే గిడ్డు సత్యనారాయణ పర్యవేక్షణ కట్టంగూరును తక్షణమే కరువు మండలంగా ప్రకటించాలి డాక్టర్ నలగాటి ప్రసన్నరాజు మృతుడి కుటుంబానికి కంటారెడ్డి తిరుపతి రెడ్డి గారు ఆర్థిక సాయం. లబ్ధిదారులకు మరింత భరోసా సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ కుందుర్పిలో తెలుగుదేశం పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రచారం. ఎంబిబిఎస్ సీటు సాధించిన లహరికకు అభినందించిన మాజీ మంత్రి హరీష్ రావు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ దంపతులు. సర్కార్ భూమి జోలికొస్తే అంతే అమీన్పూర్ పర్యటనలో కలెక్టర్ హెచ్చరిక

గ్రామాలలో మొదలైన ఎన్నికల ప్రచారం..!

Select Suryaa Now
గ్రామాలలో మొదలైన ఎన్నికల ప్రచారం..!

గ్రామాలలో మొదలైన ఎన్నికల ప్రచారం..!
- ఏకగ్రీవమైన టిడిపి అల్లూరు ఎంపీటీసీ స్థానం.
- ఎంపీపీ అభ్యర్థిగా మాధవరం సుశీలమ్మ ఎన్నికల ప్రచారం.
- జడ్పిటిసి కురువ వెంకటేశ్వర్లు గెలుపుకై ఎన్నికల ప్రచారం.
-ఎన్నికల ప్రచారంలో మండల టిడిపి కన్వీనర్ మాండ్ర సురేంద్ర నాథ్ రెడ్డి ..


నందికొట్కూరు రూరల్ మేజర్ న్యూస్ -:  నందికొట్కూరు మండల పరిధిలో లో పల్లె పోరు సందర్భంగా గ్రామాలలో ఎన్నికల సందడి మొదలైంది. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల ప్రచార హోరు తో సందడి వాతావరణం నెలకొంది. నందికొట్కూరు మండలంలోని 11 ఎంపీటీసీ స్థానాలలో ఎమ్మెల్యే గిత్త జయసూర్య స్వగ్రామమైన అల్లూరు ఎంపీటీసీ స్థానం ఏకగ్రీవంగా టిడిపి దక్కించుకుంది. మండల ప్రజా పరిషత్ అధ్యక్ష స్థానం ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో మండలంలోని దామగట్ల ఎంపీటీసీ స్థానం నుండి మాజీ సర్పంచ్ మాధవరం సుశీలమ్మ పోటీలో నిలిచారు. మండల జడ్పిటిసి అభ్యర్థిగా అల్లూరు గ్రామానికి చెందిన మాజీ కెసి డిస్ట్రిబ్యూటరీ చైర్మన్,మండల జడ్పిటిసి గా కురువ వెంకటేశ్వర్లు పోటీలో నిలిచారు. టిడిపి అభ్యర్థులు గ్రామాలలో జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. పల్లె పోరులో టిడిపి జోరు కొనసాగుతుంది. బ్రాహ్మణ కొట్కూర్ 2 ఎంపీటీసీ స్థానాలను టిడిపి  కైవసం చేసుకునేందుకు నందికొట్కూర్ టిడిపి ఇన్చార్జ్ గౌరు వెంకటరెడ్డి,సింగిల్ విండో చైర్మన్ హరి సర్వోత్తమ రెడ్డి , మాజీ ఎంపిటిసి ఖాజా మొద్దీన్ , ఉదయ్ కిరణ్  రెడ్డి, తదితరులు పావులు కదుపుతున్నారు. దామగట్ల ఎంపీటీసీ ఎస్సీ స్థానం నుండి సుశీలమ్మ గెలుపుకై గ్రామ నాయకులు తిప్పారెడ్డి,తదితరులు ప్రచార హోరు కొనసాగిస్తున్నారు. 10 బొల్లవరం ఎస్సీ ఎంపీటీసీ స్థానం నుండి గెలుపు కోసం మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి ప్రచార హోరు కొనసాగిస్తున్నారు. గ్రామాలలో టిడిపి అభ్యర్థులను గెలిపించుకునేందుకు మండల టిడిపి కన్వీనర్ మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి గ్రామాలలో పర్యటిస్తూ నాయకులను కార్యకర్తలను టిడిపి అభ్యర్థుల గెలుపుకై ఐక్యంగా ముందుకు సాగుతున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు రవి యాదవ్, ఎంపీటీసీ అభ్యర్థి మల్లికార్జునరెడ్డి, టిడిపి నాయకులు జంగాల మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.