BREAKING
కాంగ్రెస్ లో మేడ విద్యాసాగర్ కు కీలక బాధ్యతలు నర్సాపూర్‌లో విద్యార్థులతో ముఖాముఖిలో మెదక్ ఎంపీ రఘునందన్‌రావు మండల అభివృద్ధికి కృషి చేస్తా...బండి రమణమ్మ..! స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి: జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లి, ఐపీఎస్ తుఫాన్ తో రాష్ట్రానికి రూ 42 కోట్లు ఆస్తి నష్టం భూ వివాదాల పరిష్కారానికి భూముల రి సర్వే. తుఫాన్ బాధితులకు అండగా ఉండాలి ఓటు బచావో.. దేశ్ బచావో కార్యక్రమానికి తరలిన కాంగ్రెస్ నాయకులు.. జహీరాబాద్ సిద్ధేశ్వర స్వామి దేవస్థానంలో మూడు రోజుల ఆధ్యాత్మిక మహోత్సవం! సహాయక చర్యలపై ఎమ్మెల్యే గిడ్డు సత్యనారాయణ పర్యవేక్షణ కట్టంగూరును తక్షణమే కరువు మండలంగా ప్రకటించాలి డాక్టర్ నలగాటి ప్రసన్నరాజు మృతుడి కుటుంబానికి కంటారెడ్డి తిరుపతి రెడ్డి గారు ఆర్థిక సాయం. లబ్ధిదారులకు మరింత భరోసా సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ కుందుర్పిలో తెలుగుదేశం పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రచారం. ఎంబిబిఎస్ సీటు సాధించిన లహరికకు అభినందించిన మాజీ మంత్రి హరీష్ రావు

అద్దంకి నియోజకవర్గ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట. నియోజకవర్గ పరిశీలకులు.

Select Suryaa Now
అద్దంకి నియోజకవర్గ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట. నియోజకవర్గ పరిశీలకులు.

సూర్య న్యూస్ అద్దంకి.

అద్దంకి నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందని అద్దంకి నియోజకవర్గ పరిశీలకులు గంగాధర్ అన్నారు. అద్దంకి పట్టణంలోని పోతురాజు గండి వద్ద గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం గురువారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇచ్చిన హామీల కంటే మిన్నగా సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సూపర్‌ సిక్స్ పథకాల అమలుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, ప్రతి కుటుంబంలో అర్హులైన ప్రతి విద్యార్థికి తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకాలు అమలు చేయడం జరిగిందన్నారు. అద్దంకి నియోజకవర్గంలో విద్య, వైద్యం, రవాణా మరియు మౌలిక వసతుల కల్పనకు వందల కోట్ల రూపాయలు కేటాయించి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని నేతలు వెల్లడించారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న ఎన్డీయే కూటమి అభ్యర్థులను ఆదరించి స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా వారు అద్దంకి ప్రజలకు పిలుపునిచ్చారు.
అద్దంకి నియోజకవర్గంలోని విద్యార్థులకు సుమారు 11,000 సైకిళ్లను, దివ్యాంగులకు ట్రై సైకిళ్లను, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సహకారంతో పంపిణీ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. యువగళం పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు, విద్యా రంగంలో విద్యార్థులకు మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతోందని వివరించారు.
బాపట్లలో ఉన్న అద్దంకి నియోజకవర్గాన్ని ప్రకాశంలో కలపడమే కాకుండా రెవెన్యూ డివిజన్ కేంద్రంగా మార్చిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. సుమారు వంద ఎకరాల భూమిని 22(ఏ) నుంచి విముక్తి కల్పించి పట్టణ ప్రజల దీర్ఘకాలిక సమస్య పరిష్కారమైందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం తరఫున మున్సిపల్ చైర్మన్ తెదేపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాకాని అశోక్ తో పాటు 29 వార్డులలోనే కౌన్సిలర్ సభ్యులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు యలమందరావు కాలేషా వలి జనసేన నాయకులు గోరంట్ల సాయి ఉన్నారు.