BREAKING
నర్సాపూర్‌లో విద్యార్థులతో ముఖాముఖిలో మెదక్ ఎంపీ రఘునందన్‌రావు మండల అభివృద్ధికి కృషి చేస్తా...బండి రమణమ్మ..! స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి: జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లి, ఐపీఎస్ తుఫాన్ తో రాష్ట్రానికి రూ 42 కోట్లు ఆస్తి నష్టం భూ వివాదాల పరిష్కారానికి భూముల రి సర్వే. తుఫాన్ బాధితులకు అండగా ఉండాలి ఓటు బచావో.. దేశ్ బచావో కార్యక్రమానికి తరలిన కాంగ్రెస్ నాయకులు.. జహీరాబాద్ సిద్ధేశ్వర స్వామి దేవస్థానంలో మూడు రోజుల ఆధ్యాత్మిక మహోత్సవం! సహాయక చర్యలపై ఎమ్మెల్యే గిడ్డు సత్యనారాయణ పర్యవేక్షణ కట్టంగూరును తక్షణమే కరువు మండలంగా ప్రకటించాలి డాక్టర్ నలగాటి ప్రసన్నరాజు మృతుడి కుటుంబానికి కంటారెడ్డి తిరుపతి రెడ్డి గారు ఆర్థిక సాయం. లబ్ధిదారులకు మరింత భరోసా సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ కుందుర్పిలో తెలుగుదేశం పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రచారం. ఎంబిబిఎస్ సీటు సాధించిన లహరికకు అభినందించిన మాజీ మంత్రి హరీష్ రావు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ దంపతులు.

స్వచ్ఛమైన నీటిని తాగాలి.. నీటిని పొదుపుగా వినియోగించాలి: సర్పంచ్ సువర్ణ ప్రభాకర్ రెడ్డి

Select Suryaa Now
స్వచ్ఛమైన నీటిని తాగాలి.. నీటిని పొదుపుగా వినియోగించాలి: సర్పంచ్ సువర్ణ ప్రభాకర్ రెడ్డి
దారూర్, మేజర్ న్యూస్: గ్రామ ప్రజలు ఆరోగ్య పరిరక్షణ కోసం స్వచ్ఛమైన నీటిని మాత్రమే తాగాలని, నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించాలని అంతారం గ్రామ సర్పంచ్ సువర్ణ ప్రభాకర్ రెడ్డి సూచించారు. గురువారం దారూర్ మండల పరిధిలోని అంతారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ ఆధ్వర్యంలో జల మాహోత్సవం నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ కలుషిత నీటిని తాగడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరూ తాగునీటి విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. సురక్షితమైన, స్వచ్ఛమైన నీటిని వినియోగించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని పేర్కొన్నారు.ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం సూచించిన విధంగా నీటిని పొదుపుగా వినియోగించాలని, ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో నీటి కొరత ఏర్పడకుండా గ్రామ ప్రజలందరూ సమష్టిగా బాధ్యతతో వ్యవహరించాలని కోరారు. అవసరమైన మేరకే నీటిని వినియోగిస్తూ ప్రతి నీటి చుక్కను సంరక్షించాలని పిలుపునిచ్చారు. నీటి సంరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై భవిష్యత్తు అవసరాల కోసం నీటిని కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.