BREAKING
కాంగ్రెస్ లో మేడ విద్యాసాగర్ కు కీలక బాధ్యతలు నర్సాపూర్‌లో విద్యార్థులతో ముఖాముఖిలో మెదక్ ఎంపీ రఘునందన్‌రావు మండల అభివృద్ధికి కృషి చేస్తా...బండి రమణమ్మ..! స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి: జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లి, ఐపీఎస్ తుఫాన్ తో రాష్ట్రానికి రూ 42 కోట్లు ఆస్తి నష్టం భూ వివాదాల పరిష్కారానికి భూముల రి సర్వే. తుఫాన్ బాధితులకు అండగా ఉండాలి ఓటు బచావో.. దేశ్ బచావో కార్యక్రమానికి తరలిన కాంగ్రెస్ నాయకులు.. జహీరాబాద్ సిద్ధేశ్వర స్వామి దేవస్థానంలో మూడు రోజుల ఆధ్యాత్మిక మహోత్సవం! సహాయక చర్యలపై ఎమ్మెల్యే గిడ్డు సత్యనారాయణ పర్యవేక్షణ కట్టంగూరును తక్షణమే కరువు మండలంగా ప్రకటించాలి డాక్టర్ నలగాటి ప్రసన్నరాజు మృతుడి కుటుంబానికి కంటారెడ్డి తిరుపతి రెడ్డి గారు ఆర్థిక సాయం. లబ్ధిదారులకు మరింత భరోసా సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ కుందుర్పిలో తెలుగుదేశం పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రచారం. ఎంబిబిఎస్ సీటు సాధించిన లహరికకు అభినందించిన మాజీ మంత్రి హరీష్ రావు

డంపింగ్ యార్డ్ డీపీఆర్ ఇవ్వండి.. నిధులు తేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా: సీఎం రేవంత్‌కు ఎంపీ ఈటల సవాల్

Select Suryaa Now
డంపింగ్ యార్డ్ డీపీఆర్ ఇవ్వండి.. నిధులు తేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా: సీఎం రేవంత్‌కు ఎంపీ ఈటల సవాల్
మేడ్చల్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్: జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారానికి అవసరమైన నిధులను కేంద్రం నుంచి తీసుకొచ్చే బాధ్యత తనదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుగా డంపింగ్ యార్డ్ తరలింపునకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధం చేసి ఇవ్వాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. నిధులు తీసుకురాలేకపోతే రాజకీయాల నుంచే తప్పుకుంటానని ప్రకటించారు. జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ కాలుష్యం నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలని డిమాండ్ చేస్తూ మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్ ఆధ్వర్యంలో చేపట్టిన ‘జన సంకల్ప పాదయాత్ర’ మూడో రోజు గురువారం విజయవంతంగా ముగిసింది.కీసరలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ప్రారంభమైన పాదయాత్ర చీర్యాల, గృహకల్ప, బండ్లగూడ, నాగారం మీదుగా రాంపల్లి చౌరస్తా వరకు కొనసాగింది. ఆయా ప్రాంతాల్లో డంపింగ్ యార్డ్ బాధితులు, మహిళలు ఎంపీ ఈటల రాజేందర్, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర రెడ్డికి మంగళహారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తమ సమస్యలను వారి దృష్టికి తీసుకువచ్చారు.డంపింగ్ యార్డ్ బాధితులకు అండగా ఉంటామని ఈటల రాజేందర్ భరోసా ఇచ్చారు. పేద ప్రజల సమస్యల పరిష్కారమే తనకు ముఖ్యమని పేర్కొన్నారు. గతంలో మల్కాజిగిరి ప్రజలు తనను ఎంపీగా గెలిపించారని, ఇప్పుడు అదే ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిన బాధ్యత తనపై ఉందని అన్నారు. జవహర్‌నగర్ పరిసర ప్రాంతాల్లో కాలుష్యం కారణంగా చిన్నారులు చర్మ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారని, ప్రజలు అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డ్ సమస్యపై తాను చేస్తున్న పాదయాత్రను విమర్శిస్తున్న కాంగ్రెస్ నాయకులు బాధిత కుటుంబాల సమస్యలను కూడా పట్టించుకోవాలని వ్యాఖ్యానించారు. రూ.2 వేల కోట్లతో డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించలేని ప్రభుత్వం, మూసీ ప్రక్షాళనకు భారీగా నిధులు ఖర్చు చేస్తామని చెబితే ప్రజలు ఎలా విశ్వసిస్తారని ప్రశ్నించారు.
 
30 ఏళ్ల సమస్యకు పరిష్కారం చూపాలి: ఏలేటి మహేశ్వర రెడ్డి
 
పాదయాత్రకు ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర రెడ్డి రాంపల్లి చౌరస్తాలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. గత 30 ఏళ్లుగా జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ సమస్యతో పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రోజుకు సుమారు 10 వేల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు పేరుకుపోతున్నాయని, దీంతో ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతోందని పేర్కొన్నారు. డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారమై, బాధితులకు న్యాయం జరిగే వరకు బీజేపీ తరఫున పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
 
రేపు జవహర్‌నగర్‌లో ముగింపు యాత్ర.. భారీ బహిరంగ సభ
 
జన సంకల్ప పాదయాత్ర నాలుగో రోజు శుక్రవారం నాగారం నుంచి ప్రారంభమై దమ్మాయిగూడ మీదుగా జవహర్‌నగర్‌కు చేరుకోనుంది. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు జవహర్‌నగర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. బాధితులు, ప్రజలు, బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని ఎంపీ ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు.ఈ పాదయాత్రలో రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షుడు బస్వాపురం లక్ష్మీనరసయ్య, రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పా రెడ్డి, తాడూరి శ్రీనివాస్, జిల్లా మాజీ అధ్యక్షుడు పటోళ్ల విక్రమ్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏనుగు సుదర్శన్ రెడ్డి, తిరుమల రెడ్డి, వెంకటరెడ్డి, నాగారం మున్సిపల్ మాజీ చైర్మన్ కౌకుట్ల చంద్రరెడ్డి, నాగారం, కీసర బీజేపీ అధ్యక్షులు నాగరాజు, బాలరాజు, బీజేపీ యువనేత కౌకుట్ల రాహుల్ రెడ్డి, బిజ్జా శ్రీనివాస్ గౌడ్, జిల్లా నాయకులు, డివిజన్ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.