ఆర్నబ్ తుఫాన్ తో 56 హెక్టార్లలో వరి, 4 హెక్టార్లలో పత్తి నష్టం: ఏవో
చీపురుపల్లి, సూర్య : ఆర్నబ్ తుఫాన్ ప్రభావంతో మండలంలో వరి 56 హెక్టార్లు, పత్తి 4 హెక్టార్లులో నష్టం వాటిల్లినట్లు ప్రాధమికంగా గుర్తించినట్టు మండల వ్యవసాయ శాఖ ఏవో సూర్యకుమారి తెలిపారు. మండలంలోని పలు గ్రామాల్లో పంట నష్ట పరిశీలన నిమిత్తం క్షేత్రస్థాయి పర్యటన వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలతో కలిసి గురువారం నిర్వహించడం జరిగిందని ఆమె తెలిపారు. మండలంలోని గొల్లలములగాం, పెదనడిపల్లి, రామలింగాపురం, రావివలస గ్రామాల్లో పంట పొలాలను పరిశీలించామని, మండలం మొత్తమ్మీద ప్రాథమిక అంచనా ప్రకారం వరి సుమారు 56 హెక్టార్లు, పత్తి సుమారు 4 హెక్టార్లు నష్టం వాటిల్లినట్లు ప్రాధమికంగా గుర్తించామని ఆమె చెప్పారు. పర్యటనలో శాస్త్రవేత్తలు టి ఎస్ ఎస్ పాత్రో, ఎన్ అనురాధ, వై సంధ్యారాణి, యు త్రివేణి ఉన్నారు.