తిరుపతి 23వ డివిజన్ కార్పొరేటర్ గా అమృతలక్ష్మినీ భారీ మెజారిటీతో గెలిపించాలి................తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి
తిరుపతి
తెలుగుదేశం పార్టీ తిరుపతి 23వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా మన్నూరు అమృతలక్ష్మిని భారీ మెజార్టీతో గెలిపించాలని తిరుపతి జిల్లా పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి, టిటిడి ఎక్స్ అఫీషియో సభ్యులు తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి కోరారు. గురువారం నగరంలోని 23వ డివిజన్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొని, కూటమి శ్రేణులతో కలిసి ఓటర్లకు కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. తిరుపతి నగర సర్వతోముఖాభివృద్ధి ప్రజల సంక్షేమం ఎన్డీఏ కూటమితోనే సాధ్యమని పేర్కొన్నారు.మన తిరుపతి - మన భవిష్యత్తు, మన డివిజన్ అభివృద్ధే - నా ధ్యేయం" అనే నినాదంతో ముందుకు వెళ్తున్న కూటమి అభ్యర్థులను ఆశీర్వదించాలని ఓటర్లను కోరారు.23వ డివిజన్ నుండి ఎన్డీఏ కూటమి తరపున తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన్నూరు అమృత లక్ష్మి ని, మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్ ని అఖండ మెజారిటీతో గెలిపించి, ప్రజాసేవ చేసే అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు స్థానిక ప్రజల పాల్గొన్నారు