రాష్ట్రస్థాయి యోగా పోటీలకు డి. ప్రదీప్ ఎంపిక
డోన్, సూర్య ప్రతినిధి మేజర్ న్యూస్:మండల పరిధిలోని గోసోనిపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థి డి. ప్రదీప్ రాష్ట్రస్థాయి యోగా పోటీలకు ఎంపికయ్యారని ప్రధానోపాధ్యాయురాలు (హెచ్‌ఎం) ఉమాదేవి తెలిపారు. ఇటీవల నిర్వహించిన 'యోగ హర్షి టెక్ పేయర్' అండర్-14 విభాగం పోటీలలో ప్రదీప్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఈ ఘనత సాధించారని పేర్కొన్నారు.
విద్యార్థికి ప్రత్యేక శిక్షణనిచ్చి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యేలా తీర్చిదిద్దిన వ్యాయామ ఉపాధ్యాయురాలు (పీడీ) చంద్రావతిని హెచ్‌ఎంతో పాటు ఉపాధ్యాయ బృందం అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీలలోనూ ప్రదీప్ మంచి ప్రతిభ చాటి పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సంజీవరాయుడు, వేణుగోపాల్, చంద్రావతి మరియు పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
సూర్యా ప్రతినిధి వెంకటేష్ నంద్యాల జిల్లా డోన్ మండలం