శ్రీ షిరిడి సాయి మందిరంలో సంకష్టహర చతుర్థి వ్రతం.. భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు.. వ్రతంలో పాల్గొన్న భక్తులు
అనంతపురం ప్రతినిధి, మేజర్ న్యూస్ :- ఆశ్వయుజ మాస బహుళ చవితిని పురస్కరించుకొని అనంతపురం నగరంలోని 3వ రోడ్డులో ఉన్న శ్రీ షిరిడి సాయి మందిరంలో గురువారం శ్రీ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. సాయినాథుని సన్నిధిలో నిర్వహించిన వ్రత కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
వ్రతాన్ని పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు భక్తిప్రపత్తులతో పూజా కార్యక్రమాల్లో పాల్గొని వినాయకుని ఆశీస్సులు పొందారు. తమ కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని, ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలని, జీవితంలో ఎదురయ్యే కష్టాలు తొలగిపోవాలని భక్తులు స్వామివారిని ప్రార్థించారు.
సంకష్టహర చతుర్థి సందర్భంగా వినాయకుడిని పూజించడం విశేషంగా భావిస్తారు. భక్తులు నియమనిష్ఠలతో వ్రతాన్ని ఆచరించి విఘ్నాలు తొలగి, కార్యసిద్ధి కలగాలని ప్రార్థించారు. వ్రతం అనంతరం ఆలయ రిత్వికులు భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్..