BREAKING
విజయమే లక్ష్యంగా తిరుపతి 5వ డివిజన్లో తుడా చైర్మన్ సుడిగాలి ప్రచారం సమయపాలన పాటించకుంటే చర్యలు తప్పవు అభివృద్ధి చూసి ఓటు వేయండి - ఎమ్మెల్యే జూలకంటి. మాచర్లలో ఎమ్మెల్యే జూలకంటి, ఎంపీ లావు విస్తృత ప్రచారం ఇజ్రాయెల్ అరబ్ పార్టీలపై విరుచుకుపడుతున్న ప్రధాని బెంజమిన్ నెతన్యాహు! పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పణితి రవికుమార్ పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి దాత విజనరీ, డైనమిక్ నాయకుడు రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని పరమావధిగా భావించే నాయకుడు మన ప్రియతమ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మన రాష్ట్రం అభివృద్ధిలో నేడే సామాజిక పెన్షన్ల పంపిణీ....... పొన్నూరు మున్సిపల్ కమిషనర్ ఎం రమేష్ బాబు యూరప్ అంతటా జెన్-జెడ్ నిరసనల హోరు ట్రిలియన్ పారామీటర్లతో శక్తివంతమైన 'మిస్ట్రల్ లార్జ్ 4' ఏఐ మోడల్‌ను విడుదల చేసిన ఫ్రెంచ్ స్టార్టప్! వాటర్ సప్లయ్ స్కీమ్ కార్మికులకు శుభవార్త.. అధికారికంగా అడ్మినిస్ట్రేషన్ నోటీసు జారీ చేసిన ప్రముఖ సంస్థ పౌండ్‌ల్యాండ్! రైల్వే వంతెన నిర్మాణానికి ఐక్యంగా పోరాడాలి తిరుపతి 23వ డివిజన్ కార్పొరేటర్ గా అమృతలక్ష్మినీ భారీ మెజారిటీతో గెలిపించాలి................తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ఫ్రాన్స్ రుణా సంక్షోభం నివాస ప్రాంతంలో 100 కిలోల టపాసుల అక్రమ నిల్వ.. ఇద్దరి అరెస్ట్

నగరంలో ముమ్మరంగా ఎమ్మెల్యే దగ్గుపాటి సతీమణి శ్రీలక్ష్మి, కుమార్తె అశ్రిత ఎన్నికల ప్రచారం.. 45, 48 డివిజన్లలో ప్రచార కార్యక్రమం.. దగ్గుపాటి శ్రీలక్ష్మి కి మహిళల నుంచి అనూహ్య స్పందన

Select Suryaa Now
నగరంలో ముమ్మరంగా ఎమ్మెల్యే దగ్గుపాటి సతీమణి శ్రీలక్ష్మి, కుమార్తె అశ్రిత ఎన్నికల ప్రచారం..  45, 48 డివిజన్లలో ప్రచార కార్యక్రమం..   దగ్గుపాటి శ్రీలక్ష్మి కి మహిళల నుంచి అనూహ్య స్పందన

అనంతపురం ప్రతినిధి, మేజర్ న్యూస్ :-  మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్  సతీమణి దగ్గుపాటి శ్రీలక్ష్మి, కుమార్తె అశ్రిత  ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. నేడు 45, 48 డివిజన్ లలో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రచారం చేపట్టారు. స్థానిక మహిళా నేతలు, కూటమి నాయకులతో కలిసి ఆమె ప్రతి ఇంటికీ తిరుగుతూ ఓటర్లను కలిశారు. 45వ డివిజన్ టిడిపి అభ్యర్థి దాదా ఖలందర్, 48వ డివిజన్ టిడిపి అభ్యర్థి సంగీత  ఇతర నాయకులతో కలిసి ఈ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దగ్గుపాటి శ్రీలక్ష్మి  మాట్లాడుతూ.. గత రెండున్నర ఏళ్లుగా కూటమి ప్రభుత్వం నగరంలో చేపట్టిన రికార్డు స్థాయి అభివృద్ధి కార్యక్రమాలను, అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు క్షుణ్ణంగా వివరించారు. నగర సమగ్ర వికాసం కోసం, మౌలిక వసతుల కల్పన నిరంతరాయంగా సాగాలన్నా మున్సిపల్ కార్పొరేషన్‌లో కూటమి జెండా ఎగరడం ఎంతో అవసరమన్నారు. కేంద్రం, రాష్ట్రంలో, స్థానికంగా ఒకే ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి సాధ్యమన్నారు. నగర మేయర్ గా అజేష్  గెలిస్తే కేంద్రం నుంచి ఎక్కువ నిధులు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ప్రజలంతా మేయర్ తో పాటు 62డివిజన్ లోని కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని శ్రీలక్ష్మీ  కోరారు.