రూప్ కుమార్ యాదవ్ కు మద్దతుగా మాదిగల ఆత్మీయ సదస్సు
నెల్లూరు రూరల్, మేజర్ న్యూస్ : నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో సీమాంధ్ర ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పందిటి సుబ్బయ్య ఆధ్వర్యంలో స్థానిక జిపిఆర్ కళ్యాణ మండపంలో గురువారం సాయంత్రం ఆత్మీయ సమావేశం వహించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , నెల్లూరు నగర మేయర్ కూటమి అభ్యర్థి పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ తో కలిసి పాల్గొన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటరెడ్డి గిరిధర్ రెడ్డి. నెల్లూరు నగర అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. రాబోయే ఎన్నికల్లో నెల్లూరు నగర మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ గారిని, అలాగే నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని డివిజన్ కూటమి కార్పొరేటర్ అభ్యర్థులందరికీ అత్యధిక ఓట్లు వేసి, భారీ మెజార్టీతో గెలిపించాలని కోరిన నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.