BREAKING
14 మంది శ్లోకా విద్యార్థులకు స్కాలర్షిప్.. కరస్పాండెంట్ బండి నవనీశ్వర్ రెడ్డి పోగొట్టుకున్న మొబైల్‌ ఫోన్‌ బాధితుడికి అప్పగింత బోరు బావుల ఆక్రమణతో నీటి ఇబ్బందులు చేతిపంపులకు మరమ్మతులు చేపట్టాలి. : మాచర్ల : కూటమిదే విజయం : జనసేన నాయకులు తెలుగుదేశం పార్టీకి షాక్.. తలారి రంగయ్య ఆధ్వర్యంలో వైఎస్ఆర్సిపి తీర్థం పుచ్చుకున్న కార్యకర్త శ్రీనివాసులు. గ్రామాలలో మొదలైన ఎన్నికల ప్రచారం..! డంపింగ్ యార్డ్ డీపీఆర్ ఇవ్వండి.. నిధులు తేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా: సీఎం రేవంత్‌కు ఎంపీ ఈటల సవాల్ వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులకు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశాలు స్వచ్ఛమైన నీటిని తాగాలి.. నీటిని పొదుపుగా వినియోగించాలి: సర్పంచ్ సువర్ణ ప్రభాకర్ రెడ్డి అద్దంకి నియోజకవర్గ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట. నియోజకవర్గ పరిశీలకులు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు. అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్. ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి అభివృద్ధి దిశగా ముందుకు సాగుదాం - ఎమ్మెల్యే ముత్తుముల మున్సిపల్ ఎన్నికల సమగ్ర నిర్వహణ, రూట్ ఆఫీసర్ల విధులు, రవాణా మరియు ఓటింగ్ విధానంపై ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారి మార్గదర్శకాలు పోక్సో చట్టంపై న్యాయ అవగాహన పోస్టర్ ఆవిష్కరణ

దివ్యాంగ విద్యార్థులకు జిల్లా స్థాయి క్రీడా పోటీలు

Select Suryaa Now
దివ్యాంగ విద్యార్థులకు జిల్లా స్థాయి క్రీడా పోటీలు
శామీర్‌పేట, మేజర్ న్యూస్ : దివ్యాంగ విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి, వారిలో ఆత్మవిశ్వాసం, పట్టుదలను పెంపొందించేందుకు జిల్లా స్థాయి క్రీడా పోటీలు దోహదపడతాయని మేడ్చల్ జిల్లా కోఆర్డినేటర్ హేమలత, మండల విద్యాధికారి కమలాకర్ అన్నారు. గురువారం మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శామీర్‌పేట డివిజన్ హకీంపేట తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్‌లో మేడ్చల్ జిల్లా దివ్యాంగ విద్యార్థులకు జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు.ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచి విజయం సాధించిన విద్యార్థులకు అతిథులు బహుమతులు అందజేశారు. పోటీల్లో పాల్గొన్న విద్యార్థులందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ చురుగ్గా పాల్గొనాలని, ఆత్మవిశ్వాసం, పట్టుదలతో తమ ప్రతిభను చాటుకోవాలని సూచించారు. దివ్యాంగ విద్యార్థులకు తగిన ప్రోత్సాహం, అవకాశాలు కల్పిస్తే అన్ని రంగాల్లోనూ రాణించగలరని పేర్కొన్నారు.ఈ కార్యక్రమానికి విద్యార్థులు, తల్లిదండ్రులు కలిపి 160 మందికి పైగా హాజరయ్యారు. వివిధ మండలాలకు చెందిన ప్రత్యేక ఉపాధ్యాయులు శ్రీకాంత్ చారి, ఇతర ప్రత్యేక ఉపాధ్యాయులు, ఐఈఆర్‌పీలు పాల్గొన్నారు.