telangana
కిచెన్ షెడ్డు లేక చెట్ల కిందే వంటలు.. ఇబ్బందుల్లో వంట కార్మికులు
కుల్కచర్ల, మేజర్ న్యూస్: మండల పరిధిలోని పిరంపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలలో కిచెన్ షెడ్డు లేక వంట కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాల ఆవరణలో చెట్ల కిందే వంటలు వండాల్సిన పరిస్థితి నెలకొంది. దుమ్ము, ధూళి మధ్య ఆహారం సిద్ధం చేయాల్సి రావడంతో విద్యార్థులకు భోజనం అందించడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.విద్యార్థులకు ప్రతిరోజూ పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యమైన భోజనం అందించాల్సి ఉండగా, పాఠశాలలో వంటశాల సౌకర్యం లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఎండ, వానలతోపాటు దుమ్ము, ధూళి మధ్య వంటలు చేయాల్సి రావడంతో వంట కార్మికులు అవస్థలు పడుతున్నారు. సరైన వంటశాల లేకపోవడం వల్ల ఆహార పరిశుభ్రతకు ఆటంకం కలిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పిరంపల్లి ప్రాథమిక పాఠశాలలో కిచెన్ షెడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వంట కార్మికుల ఇబ్బందులను తొలగించి, పరిశుభ్రమైన వాతావరణంలో మధ్యాహ్న భోజనం తయారు చేసేలా తగిన సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.