BREAKING
14 మంది శ్లోకా విద్యార్థులకు స్కాలర్షిప్.. కరస్పాండెంట్ బండి నవనీశ్వర్ రెడ్డి పోగొట్టుకున్న మొబైల్‌ ఫోన్‌ బాధితుడికి అప్పగింత బోరు బావుల ఆక్రమణతో నీటి ఇబ్బందులు చేతిపంపులకు మరమ్మతులు చేపట్టాలి. : మాచర్ల : కూటమిదే విజయం : జనసేన నాయకులు తెలుగుదేశం పార్టీకి షాక్.. తలారి రంగయ్య ఆధ్వర్యంలో వైఎస్ఆర్సిపి తీర్థం పుచ్చుకున్న కార్యకర్త శ్రీనివాసులు. గ్రామాలలో మొదలైన ఎన్నికల ప్రచారం..! డంపింగ్ యార్డ్ డీపీఆర్ ఇవ్వండి.. నిధులు తేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా: సీఎం రేవంత్‌కు ఎంపీ ఈటల సవాల్ వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులకు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశాలు స్వచ్ఛమైన నీటిని తాగాలి.. నీటిని పొదుపుగా వినియోగించాలి: సర్పంచ్ సువర్ణ ప్రభాకర్ రెడ్డి అద్దంకి నియోజకవర్గ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట. నియోజకవర్గ పరిశీలకులు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు. అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్. ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి అభివృద్ధి దిశగా ముందుకు సాగుదాం - ఎమ్మెల్యే ముత్తుముల మున్సిపల్ ఎన్నికల సమగ్ర నిర్వహణ, రూట్ ఆఫీసర్ల విధులు, రవాణా మరియు ఓటింగ్ విధానంపై ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారి మార్గదర్శకాలు పోక్సో చట్టంపై న్యాయ అవగాహన పోస్టర్ ఆవిష్కరణ

రాజకీయ లబ్ధి కోసమే ఈటల పాదయాత్ర: డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్‌ యాదవ్‌

Select Suryaa Now
రాజకీయ లబ్ధి కోసమే ఈటల పాదయాత్ర: డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్‌ యాదవ్‌
మేడ్చల్‌ జిల్లా ప్రతినిధి, మేజర్‌ న్యూస్‌: జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డు సమస్యపై మాట్లాడే నైతిక హక్కు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌కు లేదని, రాబోయే స్థానిక సంస్థలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందేందుకే ఆయన పాదయాత్ర చేపట్టారని మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు, మేడ్చల్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ తోటకూర వజ్రేష్‌ యాదవ్‌ విమర్శించారు. గురువారం దమ్మాయిగూడలోని తిరుమల గార్డెన్స్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.గతంలో ఉమ్మడి రాష్ట్రంలో మున్సిపాలిటీల చెత్తను జవహర్‌నగర్‌కు తరలించడం వల్ల పరిసర ప్రాంతాల ప్రజారోగ్యంపై ప్రభావం పడిందని వజ్రేష్‌ యాదవ్‌ పేర్కొన్నారు. గతంలో 15 ఏళ్లకు పైగా మంత్రిగా పనిచేసిన సమయంలో డంపింగ్‌ యార్డు తరలింపుపై ఈటల రాజేందర్‌ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఎంపీగా ఎన్నికైన తర్వాత ప్రజలకు కాలుష్యం నుంచి విముక్తి కల్పించే దిశగా చర్యలు తీసుకోవాల్సిందిపోయి, రాజకీయ ప్రయోజనాల కోసం పాదయాత్రలు చేస్తున్నారని ఆరోపించారు. డంపింగ్‌ యార్డు తరలింపుపై బీజేపీ, ఈటల రాజేందర్‌ వద్ద ఉన్న స్పష్టమైన విధివిధానాలు, కార్యాచరణ ప్రణాళికను ప్రజలకు వివరించాలని డిమాండ్‌ చేశారు.ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం డంపింగ్‌ యార్డు సమస్య పరిష్కారానికి కట్టుబడి ఉందని వజ్రేష్‌ యాదవ్‌ తెలిపారు. గండిమైసమ్మ, శంషాబాద్‌, బండరావిరాల ప్రాంతాలను పరిశీలించడంతోపాటు అఖిలపక్ష సమావేశం నిర్వహించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కృషి చేస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్థల కేటాయింపులు, సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) తయారీకి కాంగ్రెస్‌ పార్టీ సహకరిస్తుందని పేర్కొన్నారు.కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు తీసుకురావడంతోపాటు కాలుష్య నియంత్రణ మండలి సహకారం అందేలా చూడాల్సిన బాధ్యత ఎంపీలు ఈటల రాజేందర్‌, కిషన్‌ రెడ్డి, రఘునందన్‌ రావు, విశ్వేశ్వర్‌ రెడ్డిపై ఉందని అన్నారు. డంపింగ్‌ యార్డు సమస్య పరిష్కారానికి రాజకీయాలకు అతీతంగా సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు.ఈ సమావేశంలో డీసీసీ ఉపాధ్యక్షులు వేముల మహేష్‌ గౌడ్‌, బాల్‌ రెడ్డి, అధికార ప్రతినిధి ఉద్దండపురం సత్యనారాయణ, దమ్మాయిగూడ డివిజన్‌ అధ్యక్షుడు ముప్పా రామరావు, జిల్లా ప్రధాన కార్యదర్శులు సురకంటి శ్రీకాంత్‌ రెడ్డి, ఎస్‌. శ్రీనివాస్‌ గౌడ్‌, యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు కందడి శ్రవణ్‌ రెడ్డి, వివిధ డివిజన్ల అధ్యక్షులు కర్రె రాజేష్‌, మల్లెపూల శ్రీకాంత్‌, శాంతి కోటేష్‌ గౌడ్‌, తుంగతుర్తి రవి, రమేష్‌, వెంకటేష్‌, సీనియర్‌ నాయకులు పండాల అనురాధ గౌడ్‌, బండారి మల్లేష్‌ యాదవ్‌, మాదిరెడ్డి నరేందర్‌ రెడ్డి, సామల శ్రీనివాస్‌ రెడ్డి, దుర్గా ప్రసాద్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.