4వ డివిజన్‌లో కూటమి అభ్యర్థులకు మద్దతుగా విస్తృత ప్రచారం
నెల్లూరు రూరల్, మేజర్ న్యూస్ : నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని 4వ డివిజన్ సౌత్ రాజుపాలెంలో కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర ఆక్వా కల్చర్ డెవలప్‌మెంట్ చైర్మన్ ఆనం వెంకట రమణారెడ్డితో కలిసి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నెల్లూరు పార్లమెంట్ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ, నెల్లూరు నగర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో నెల్లూరు నగర మేయర్ అభ్యర్థి పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్‌తో పాటు 4వ డివిజన్ కూటమి కార్పొరేటర్ అభ్యర్థి మానికల నాగమణికి మద్దతు తెలిపి, భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.