పల్లె పోరులో... ప్రచారాల హోరు
సీతానగరం, సూర్య : సీతానగరం జడ్పిటిసి టిడిపి పార్టీ అభ్యర్థి కంకణపల్లి అనురాధ గురువారం తమ పార్టీ నాయకులతో ప్రచార హోరు కొనసాగించారు. పెదబోగీల. కొత్తవలస. గెడ్డలప్పి. బగ్గందొర వలస. బల్లకృష్ణరాయిపురం. చినబోగిలి గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని ఆయా గ్రామాల స్థానిక నాయకులతో కలిసి ప్రజలను పలకరించి నవంబరు ఐదున జరుగునున్న జడ్పిటిసి ఎన్నికల్లో తమకు ఓటు వేసి అత్యధిక మెజార్టీ వచ్చేలా మీ సహాయ సహకారాలు అందించాలని ఆమె కోరారు. ప్రచారాల్లో భాగంగా గ్రామ ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటూ స్థానికంగా జరుగుతున్న సమస్యలు అభివృద్ధిపై చేపట్టే కార్యక్రమాలు పైన ప్రజలకు తెలియజేశారు గ్రామాల అభ్యున్నతికి కృషి చేయాలన్న సత్ సంకల్పంతో తాను జడ్పిటిసి అభ్యర్థిగా పోటీ చేయుచున్నానని మీరంతా సైకిల్ గుర్తుకే ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో టిడిపి పార్టీ నాయకులు రౌతు వేణుగోపాల్ నాయుడు. పెంట సత్యం నాయుడు. పేల నాగభూషణ్. వెంకట్ నాయుడు తో పాటు పలువురు టిడిపి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.