BREAKING
విజయమే లక్ష్యంగా తిరుపతి 5వ డివిజన్లో తుడా చైర్మన్ సుడిగాలి ప్రచారం సమయపాలన పాటించకుంటే చర్యలు తప్పవు అభివృద్ధి చూసి ఓటు వేయండి - ఎమ్మెల్యే జూలకంటి. మాచర్లలో ఎమ్మెల్యే జూలకంటి, ఎంపీ లావు విస్తృత ప్రచారం ఇజ్రాయెల్ అరబ్ పార్టీలపై విరుచుకుపడుతున్న ప్రధాని బెంజమిన్ నెతన్యాహు! పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పణితి రవికుమార్ పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి దాత విజనరీ, డైనమిక్ నాయకుడు రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని పరమావధిగా భావించే నాయకుడు మన ప్రియతమ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మన రాష్ట్రం అభివృద్ధిలో నేడే సామాజిక పెన్షన్ల పంపిణీ....... పొన్నూరు మున్సిపల్ కమిషనర్ ఎం రమేష్ బాబు యూరప్ అంతటా జెన్-జెడ్ నిరసనల హోరు ట్రిలియన్ పారామీటర్లతో శక్తివంతమైన 'మిస్ట్రల్ లార్జ్ 4' ఏఐ మోడల్‌ను విడుదల చేసిన ఫ్రెంచ్ స్టార్టప్! వాటర్ సప్లయ్ స్కీమ్ కార్మికులకు శుభవార్త.. అధికారికంగా అడ్మినిస్ట్రేషన్ నోటీసు జారీ చేసిన ప్రముఖ సంస్థ పౌండ్‌ల్యాండ్! రైల్వే వంతెన నిర్మాణానికి ఐక్యంగా పోరాడాలి తిరుపతి 23వ డివిజన్ కార్పొరేటర్ గా అమృతలక్ష్మినీ భారీ మెజారిటీతో గెలిపించాలి................తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ఫ్రాన్స్ రుణా సంక్షోభం నివాస ప్రాంతంలో 100 కిలోల టపాసుల అక్రమ నిల్వ.. ఇద్దరి అరెస్ట్

విజయనగరం సమగ్ర అభివృద్ధే లక్ష్యం..... బీఎస్పీ మేయర్ అభ్యర్థిని లింగాల పార్వతికి మద్దతుగా ప్రచార ర్యాలీ

Select Suryaa Now
విజయనగరం సమగ్ర అభివృద్ధే లక్ష్యం..... బీఎస్పీ మేయర్ అభ్యర్థిని లింగాల పార్వతికి మద్దతుగా ప్రచార ర్యాలీ

విజయనగరం, సూర్య : విజయనగరం నగరపాలక సంస్థ మేయర్ అభ్యర్థిని శ్రీమతి లింగాల పార్వతికి మద్దతుగా బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో సోము రాంబాబు సారధ్యంలో ప్రచార ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సోము రాంబాబు మాట్లాడుతూ, పూలే–అంబేడ్కర్–కాన్షీరామ్ ఆశయాల సాధన, సామాజిక న్యాయం, బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా బీఎస్పీ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని తెలిపారు.విజయనగరం నగరంలో పెద్ద చెరువుతో పాటు ఇతర చెరువుల అభివృద్ధి, మురుగునీటి సమస్య పరిష్కారం, వర్షపు నీరు నిలిచే ప్రాంతాల్లో శాశ్వత డ్రైనేజీ వ్యవస్థ, రహదారులు, తాగునీరు, పారిశుధ్యం, వీధి దీపాలు, పార్కుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. చిరు వ్యాపారుల సమస్యలు, మహిళల భద్రత, నిరుపేదలకు గృహ వసతి, అంగన్‌వాడీ కేంద్రాల పర్యవేక్షణ, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు, మున్సిపల్ కార్మికుల వేతనాలు సకాలంలో అందేలా చర్యలు వంటి అంశాలపై సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాధన వినియోగంలో పారదర్శకత, వార్డుల వారీగా ప్రజా సమస్యల పరిష్కారమే పాలనలో ప్రధాన లక్ష్యాలుగా ఉండాలని తెలిపారు. ఈ ప్రచార ర్యాలీ గాజులరేగ, పూల్‌బాగ్, కొత్తపేట, సాకేటి వీధి, లంకపట్నం, కంటోన్మెంట్, జొన్నగుడ్డి, కాటవీధి, బొంగవీధి, వీ.టి. అగ్రహారం, కనపాక ప్రాంతాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి కొమ్ము సోములు, విజయనగరం జిల్లా అధ్యక్షుడు బొచ్చా బుద్ధుడు, జిల్లా ఉపాధ్యక్షుడు కారు గౌరి, విజయనగరం నియోజకవర్గ అధ్యక్షుడు అర్జి పైడిరాజు, నగర కన్వీనర్ రాము, అప్పలనాయుడు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.