బొబ్బిలి మున్సిపల్ ఎన్నికలకు ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా కఠిన ఆంక్షలు:
బొబ్బిలి, సూర్య : బొబ్బిలి,పట్టణం లో జరగనున్న మున్సిపల్ ఎన్నికలు సంబంధించిన 36 వార్డులు, 69 కేంద్రాల్లో నవంబర్ 1న పోలింగ్ నేపథ్యంలో అధికారులు కఠిన ఆంక్షలు విధించారు. బొబ్బిలి మున్సిపల్ కార్యాలయంలో గురువారం ఆర్డీవో జె.వి.ఎస్.ఎస్. రామ్మోహనరావు, డీఎస్పీ ఆర్. గోవిందరావు, మున్సిపల్ కమిషనర్ ఎల్. రామలక్ష్మి, టౌన్ సీఐ కె. నారాయణరావు సంయుక్త విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30వ తేదీ సాయంత్రం 5 గంటల నుండి 48 గంటల ముందు కాలం అమల్లో ఉంటుందని, ఎలాంటి ప్రచారం నిషేధమని తెలిపారు. ఎలాంటి సభ, ర్యాలీ నిర్వహించాలన్నా పోలీస్ యాక్ట్ 30 కింద ముందస్తు లైసెన్స్ తప్పనిసరని డీఎస్పీ గోవిందరావు, సీఐ నారాయణరావు స్పష్టం చేశారు. 30వ తారీకు సాయంత్రం ఐదు గంటల తర్వాత లిక్కర్ అమ్మకాలు పూర్తిగా బంద్ అవుతాయి. మద్యం షాపులు బార్లు పూర్తిగా మూసి వేయడం జరుగుతుంది.
100 మీటర్ల లోపు బి ఎన్ఎస్ఎస్ 163 అమలు, 200 మీటర్ల లోపు వాహనాలు, గుంపులు, ప్రచారం నిషేధం. వాహనాలు 200 మీటర్ల ముందే ఆపి నడుచుకుంటూ రావాలి. 200 మీటర్ల తర్వాత పార్టీకి ఒక టేబుల్, రెండు కుర్చీలు, ఒక గొడుగు మాత్రమే అనుమతి. బూత్ లోపలికి మొబైల్, గాడ్జెట్స్, పార్టీ సింబల్స్ నిషేధమని, ఓటుకు ID ప్రూఫ్ తప్పనిసరి అని కమిషనర్ ఎల్. రామలక్ష్మి తెలిపారు. అభ్యర్థులు, ఏజెంట్లు బూత్ లో 1-2 నిమిషాలు మాత్రమే ఉండాలి. 30వ తేదీ సాయంత్రం 5 గంటల నుండి లిక్కర్ షాపులు పూర్తి బంద్. ఎగ్జిట్ పోల్స్, సోషల్ మీడియా దుష్ప్రచారం చేస్తే చర్యలు తప్పవని తెలిపారు. ఆరు రూట్లలో స్ట్రైకింగ్ ఫోర్సులు తిరుగుతాయని, మైక్రో అబ్జర్వర్స్, మఫ్టీ పోలీసుల నిఘా ఉంటుందని డీఎస్పీ ఆర్. గోవిందరావు, టౌన్ సీఐ కె. నారాయణరావు తెలిపారు. ప్రజలు ఎక్కడా గుమిగూడవద్దు, వీధుల్లో నలుగురు ఐదుగురు గుంపులుగా ఉండవద్దు, ఎవరి ఇంటి వద్ద వారే ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే 370 మందిని బైండోవర్ చేశామని తెలిపారు.