BREAKING
గుంతలమయంగా ఘనపూర్ గేటు–చేల్లాపూర్ రోడ్డు.. నూతన రోడ్డు నిర్మించాలి: బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ గడుసు మహిపాల్ వలేరు రూతమ్మను గెలిపించండి శ్రీ షిరిడి సాయి మందిరంలో సంకష్టహర చతుర్థి వ్రతం.. భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు.. వ్రతంలో పాల్గొన్న భక్తులు హెలియన్‌కు భారీ ఎదురుదెబ్బ కిచెన్‌ షెడ్డు లేక చెట్ల కిందే వంటలు.. ఇబ్బందుల్లో వంట కార్మికులు వడ్డీ రేట్ల కంటే ఫ్రాన్స్‌కే ఎక్కువ ప్రాధాన్యం దివ్యాంగ విద్యార్థులకు జిల్లా స్థాయి క్రీడా పోటీలు రాజకీయ లబ్ధి కోసమే ఈటల పాదయాత్ర: డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్‌ యాదవ్‌ క్లోరెక్స్ కొత్త సీఈఓగా యూనిలీవర్ మాజీ ఎగ్జిక్యూటివ్ పర్యావరణ పునరుద్ధరణ చర్యలను వేగవంతం చేయాలి రాష్ట్ర పండుగను తలపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం.. అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన స్విట్జర్లాండ్ బయోటెక్ దిగ్గజం మాలిక్యులర్ పార్టనర్స్ సంచలన నిర్ణయం ఫోక్స్‌వ్యాగన్‌కు భారత్‌లో రూ. 12 వేల కోట్ల భారీ పన్ను వివాదంపై హైకోర్టులో కొత్త మలుపు! తగ్గేదేలే...! *కార్పొరేషన్ లో పెరిగిన హీట్

పత్తి పంటను పరిశీలించిన శాస్త్రవేత్తల బృందం :

Select Suryaa Now
పత్తి పంటను పరిశీలించిన శాస్త్రవేత్తల బృందం :

పత్తి పంటను పరిశీలించిన శాస్త్రవేత్తల బృందం :

నాదెండ్ల మండలంలోని అప్పాపురం  గ్రామంలో ఆర్నబ్ తూఫాన్ వల్ల జరిగిన నష్టాన్ని  అంచనా వేయడానికి శాస్త్రవేత్తల బృందం పర్యటించింది. ఈ బృందంలో డా ఎన్. చాముండేశ్వరి,ప్రధాన శాస్త్రవేత్త (ప్రత్తి), డా ఎల్. రాజేష్ చౌదరి, శాస్త్రవేత్త (ఇంటిమలజీ ), డా సిహెచ్  నాగ జ్యోతి, శాస్త్రవేత్త (ఆగ్రోనమీ ) మండల వ్యవసాయ అధికారి తూబాటి శ్రీలతఉన్నారు.అయితే ఈ అర్ణబ్ తూఫాన్ యొక్క తీవ్రత పల్నాడు ప్రాంతాల్లో తక్కువగా ఉంది. 30-40 కి.మీ. వేగంతో గాలి వీచి 3-5 మి. మీ. వర్షపాతం మాత్రమే నమోదు కావడం వలన తూఫాన్ ప్రభావం అంతగా కనపడలేదు. కానీ ఎల్ నినో ప్రభావం వలన పత్తి పంట ఆశించిన స్థాయిలో పెరుగుదల లేదు. పత్తి లో గులాబీ రంగు పురుగు మరియు కాయకుళ్ళు తెగులు ఎక్కువగా ఉండడం గమనించి యాజమాన్య పద్ధతులను సూచించారు.

కాయ కుళ్ళు ని తగ్గించడానికి 3 గ్రా. కాపర్ ఆక్సీ క్లోరైడ్ (సిఓ సి) + 0.1 గ్రా. స్ట్రెప్ట్రె్టోసైక్లిన్ / లీ. మొక్కల

క్రింది భాగపు కొమ్మలు మరియు పచ్చటికాయలు తడిసేలా పిచికారీచేయాలి. గులాబీ రంగు పురుగు నివారణకు ఎకరానికి ప్రొఫెనోఫోస్ 50 ఈసీ 2 ఎంల్ లేదా తాయోడికార్డ్ 75 wc 1.5 గ్రాములు లేదా క్వినాల్ ఫాస్ 25 ఏసీ 2.5 ఎం ఎల్ లేదా క్లోరిపైరీఫాస్ 20 ఈసీ 2.5 ఎం ఎల్  ఒక లీటర్ నీటికి కలిపి పది రోజుల వ్యవధిలో రెండు లేక మూడు పర్యాయాలు మందులను మార్చి మార్చి పిచికారి చేసుకోవాలి. సింథటిక్ పైరుత్రాయిడ్స్ పంట 100 రోజులు దాటిన తర్వాత వాడుకోవచ్చు అని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో రైతు భరోసా సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.