BREAKING
గుంతలమయంగా ఘనపూర్ గేటు–చేల్లాపూర్ రోడ్డు.. నూతన రోడ్డు నిర్మించాలి: బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ గడుసు మహిపాల్ వలేరు రూతమ్మను గెలిపించండి శ్రీ షిరిడి సాయి మందిరంలో సంకష్టహర చతుర్థి వ్రతం.. భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు.. వ్రతంలో పాల్గొన్న భక్తులు హెలియన్‌కు భారీ ఎదురుదెబ్బ కిచెన్‌ షెడ్డు లేక చెట్ల కిందే వంటలు.. ఇబ్బందుల్లో వంట కార్మికులు వడ్డీ రేట్ల కంటే ఫ్రాన్స్‌కే ఎక్కువ ప్రాధాన్యం దివ్యాంగ విద్యార్థులకు జిల్లా స్థాయి క్రీడా పోటీలు రాజకీయ లబ్ధి కోసమే ఈటల పాదయాత్ర: డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్‌ యాదవ్‌ క్లోరెక్స్ కొత్త సీఈఓగా యూనిలీవర్ మాజీ ఎగ్జిక్యూటివ్ పర్యావరణ పునరుద్ధరణ చర్యలను వేగవంతం చేయాలి రాష్ట్ర పండుగను తలపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం.. అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన స్విట్జర్లాండ్ బయోటెక్ దిగ్గజం మాలిక్యులర్ పార్టనర్స్ సంచలన నిర్ణయం ఫోక్స్‌వ్యాగన్‌కు భారత్‌లో రూ. 12 వేల కోట్ల భారీ పన్ను వివాదంపై హైకోర్టులో కొత్త మలుపు! తగ్గేదేలే...! *కార్పొరేషన్ లో పెరిగిన హీట్

కేసీఆర్‌దే హాలిడే.. కాంగ్రెస్ ప్రభుత్వానికి కాదు: ఆది శ్రీనివాస్

Select Suryaa Now
కేసీఆర్‌దే హాలిడే.. కాంగ్రెస్ ప్రభుత్వానికి కాదు: ఆది శ్రీనివాస్

 

సూర్య బ్యూరో ప్రతినిధి : అధికారం కోల్పోయిన మాజీ సీఎం కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారని, రాష్ట్రంలో ఆయనకు తప్ప మరెవరికీ హాలిడే లేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి హాలిడే ఇవ్వాలన్న కేటీఆర్ వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. అహంకారం, అక్కసుతో కేటీఆర్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుపై కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆది శ్రీనివాస్ ఆరోపించారు. తొలి దశలో 21 కిలోమీటర్ల మేర పనులకు డీపీఆర్ రూపొందించి, రూ.7,345 కోట్లతో టెండర్లు పిలిచినట్లు తెలిపారు. మూసీపై నిర్వహించింది ప్రజాభిప్రాయ సేకరణ కాదని, స్టేక్‌హోల్డర్ల సంప్రదింపుల సమావేశమని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో కరువు, విద్యుత్ కోతలు ఉన్నాయన్న కేటీఆర్ ఆరోపణలను ఆయన ఖండించారు. 20 వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ వచ్చినా సరఫరా చేశామని, రైతులకు విద్యుత్ అందించేందుకు అవసరమైన విద్యుత్‌ను కొనుగోలు చేశామని చెప్పారు. ప్రభుత్వం క్రాప్ హాలిడే ప్రకటించలేదని, అధిక నీటి వినియోగం ఉండే పంటలకు బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచించిందని వివరించారు.

కన్నెపల్లి వద్ద నీటిని ఎత్తిపోకుండా ఆంధ్రప్రదేశ్‌కు తరలించారన్న ఆరోపణలను కూడా ఆయన తోసిపుచ్చారు. కాళేశ్వరం బ్యారేజీల్లో నీటి నిల్వపై ఎన్డీఎస్ఏ సూచనలను పాటిస్తున్నామని, దేవాదుల, సీతారామసాగర్ ప్రాజెక్టుల ద్వారా గోదావరి నీటిని వినియోగించుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రైతులకు అండగా నిలవాల్సిన ప్రతిపక్షం రాజకీయ విమర్శలకే పరిమితమవుతోందని ఆది శ్రీనివాస్ విమర్శించారు. ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలకు వాస్తవాలతో సమాధానం చెబుతామని పేర్కొన్నారు.