BREAKING
అంబటి అంజయ్యకు ఎమ్మెల్యే వేముల వీరేశం నివాళి నర్కూడలో రోడ్డు ప్రమాదం.. ఒకరికి తీవ్ర గాయాలు సౌత్ రాజుపాలెంలో ఆనం వెంకట రమణారెడ్డితో కలిసి ప్రచారంలో పాల్గొన్న కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి నేర పరిశోధనకు సిసిటివి కెమెరాలు కీలకం - సిఐ సరవయ్య కుందుర్పి లో కూటమి అభ్యర్థి వెంకటేష్ విస్తృతంగా ప్రచారం. రాఘవేంద్రుడిని దర్శించుకున్న వైసీపీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్.. ప్రత్యేక పూజలు.. ఆశీర్వదించిన పండితులు ఇండో–శ్రీలంక మైత్రి సేతు అంతర్జాతీయ సైకిల్ యాత్రకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా కూటమి అభ్యర్థులకూ వేసి గెలిపించండి గాజు గ్లాస్ కి, సైకిల్ గర్హుకి ఓటు వేయండి త్రాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ అధికారులకు మున్సిపల్ చైర్‌పర్సన్ కొండ శ్వేత సత్య యాదవ్ సూచన దేపూరులో జడ్పిటిసి, ఎంపీటీసీ అభ్యర్థుల ముమ్మార ప్రచారం ఆనం ఆశీస్సులతో పోటీ - ఆనం సహకారంతో అభివృద్ధి - జడ్పిటిసి అభ్యర్థి డాక్టర్ తూమాటి మొక్కల పైనే సమాజ మనుగడ. గర్జించిన మహిళా లోకం - టీడీపీకి బ్రహ్మరథం..నారీ భేరి ర్యాలీకి పెద్దఎత్తున తరలివచ్చిన మహిళా మణులు... ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి. అంబటి అంజయ్య కు ఎమ్మెల్యే వేముల నివాళి*

రైతులకు శాస్త్రవేత్తల సూచనలు...!!

Select Suryaa Now
రైతులకు శాస్త్రవేత్తల సూచనలు...!!

ఆనందపురం, సూర్య : ఆర్నబ్‌ తుపాను ప్రభావంతో పంటలకు నష్టం వాటిల్లకుండా రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు. ఈ మేరకు భీమిలి, విశాఖ వ్యవసాయ ఉపవిభాగాల పరిధిలోని వివిధ గ్రామాల్లో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, వ్యవసాయ శాఖ సంయుక్త బృందం గురువారం పర్యటించి పంటలను పరిశీలించింది. రైతులకు పంటల సంరక్షణ చర్యలపై అవగాహన కల్పించింది.
అనకాపల్లిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ అప్పలస్వామి ఆధ్వర్యంలో ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రవికుమార్‌, కీటక శాస్త్రవేత్త డాక్టర్ ఆర్‌. సరిత, కొక్కిరాపల్లి వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఏబీఎం శిరీష పర్యటనలో పాల్గొన్నారు. భీమిలి మండలం దాకమర్రి, టీ.నగరపాలెం, ఆనందపురం మండలం బోని, చందక, గొట్టిపల్లి గ్రామాల్లోని పంట పొలాలను సందర్శించి రైతులకు పలు సూచనలు చేశారు. వరి పొలాల్లో అధికంగా నిలిచిన నీటిని వెంటనే బయటకు పంపించాలని శాస్త్రవేత్తలు సూచించారు. నేలకొరిగిన వరి పంటను సాధ్యమైనంతవరకు తిరిగి నిలబెట్టుకునే చర్యలు చేపట్టాలని తెలిపారు. పంట పరిస్థితిని బట్టి ఎకరానికి 25 కిలోల యూరియా, 15 కిలోల పొటాష్‌ ఎరువులు వేయాలని సూచించారు. వరి పంటలో పొడ తెగులు వ్యాపించే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలన్నారు. నివారణకు ఎకరానికి 400 మిల్లీలీటర్ల హెక్సాకొనజోల్‌ లేదా 200 మిల్లీలీటర్ల ప్రొపికొనజోల్‌ను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలని వివరించారు. కాలీఫ్లవర్‌, వంగ, బొప్పాయి తదితర పంటల్లో నీరు నిల్వ ఉండకుండా తక్షణమే బయటకు పంపించాలని శాస్త్రవేత్తలు సూచించారు. వర్షాల కారణంగా వేరుకుళ్లు తెగులు వ్యాపించకుండా నివారణ చర్యలు చేపట్టాలన్నారు. ఇందుకోసం కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ను లీటరు నీటికి రెండు గ్రాముల చొప్పున కలిపి, మొక్కల మొదళ్ల వద్ద నేల తడిచేలా వినియోగించాలని తెలిపారు. ఈ పర్యటనలో భీమిలి వ్యవసాయ అధికారి కోమలి, ఆనందపురం వ్యవసాయ అధికారి సంధ్యారత్నప్రభ, గ్రామ వ్యవసాయ సహాయకులు రాజేశ్వరి, కృపతో పాటు అభ్యుదయ రైతులు పాల్గొన్నారు. తుపాను ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటిస్తూ పంటలను సంరక్షించుకోవాలని శాస్త్రవేత్తలు కోరారు.