పేదింటి ఆడబిడ్డ పెళ్లికి అండగా నిలిచిన జర్పుల దశరథ్ నాయక్
కడ్తాల్, రంగారెడ్డి
కడ్తాల్ మండల కేంద్రంలో రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదింటి ఆడబిడ్డ పెళ్లికి కొండంత ఆసరా లభించింది.
రేఖ్యతండా గ్రామపంచాయతీకి చెందిన జర్పుల శాంతి, దాస్య దంపతుల కుమార్తె మంజుల వివాహానికి ట్రస్ట్ చైర్మన్, కడ్తాల్ మాజీ జెడ్పీటీసీ, LHPS రాష్ట్ర ఉపాధ్యక్షుడు జర్పుల దశరథ్ నాయక్ రూ.21,000 నగదు సహాయం, పట్టు చీరను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలు, గిరిజనుల అభ్యున్నతి కోసం ట్రస్ట్ నిరంతరం పనిచేస్తుందని, ఆర్థిక ఇబ్బందులతో ఏ పేద కుటుంబం అధైర్యపడకూడదనే లక్ష్యంతో సేవా కార్యక్రమాలు విస్తరిస్తామని తెలిపారు.
కార్యక్రమంలో సర్పంచ్ నరసింహ గౌడ్, మాజీ ఎంపీటీసీ మంజుల చంద్రమౌళి, మాజీ సర్పంచ్ హరిచంద్ నాయక్, ఉప సర్పంచ్ దేవు నాయక్, ప్రియా రమేష్ నాయక్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.