కలెక్టరు వాహనాన్ని మద్యం మత్తులో ఢీ కొట్టిన లారీ డ్రైవర్ కు వారం రోజులు జైలుశిక్ష....
విజయనగరం, సూర్య : విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి కారును మద్యం మత్తులో ఢీ కొట్టిన లారీ డ్రైవర్ కు సాలూరు జె.ఎఫ్.సి.ఎం. మెజిస్ట్రేట్ శ్రీ జి.హర్ష వర్ధన్ 7రోజులు సాధారణ జైలుశిక్ష విధించినట్లుగా జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ తెలిపారు. వివరాల్లోకి వెళితే.. విజయనగరం జిల్లా కలెక్టరు ఎస్.రామసుందర్ రెడ్డి ఎన్నికల నిర్వహణ పనులను పర్యవేక్షించేందుకు గాను అక్టోబరు 28న బొబ్బిలి వెళ్ళి, తిరిగి వస్తూ బూసాయవలస కోల్డ్ స్టోరేజ్ వద్దకు చేరేసరికి మహారాష్ట్ర నాగపూర్ కు చెందిన లారీ డ్రైవరు వివేక్ విజయ్ కరన్వర్ అనే వ్యక్తి మద్యం మత్తులో రాంగ్ రూట్ లో పార్కింగ్ చేసిన లారీని నడుపుతూ, ఎదురుగా వస్తున్న కలెక్టరు గారి వాహనాన్ని ఢీ కొట్టి, వాహనాన్ని ఆపకుండా పరారయ్యేందుకు ప్రయత్నించగా, పోలీసులు సదరు వాహనాన్ని వెంబడించి, పట్టుకున్నారన్నారు. అనంతరం, రామభద్రపురం పోలీసులు కేసు నమోదు చేసి, సాలూరు జె ఎఫ్ సి ఎంకోర్టులో హాజరుపర్చగా, జె ఎఫ్ సి ఎంమేజిస్ట్రేట్ శ్రీ జీ.హర్ష వర్ధన్ మద్యం మత్తులో లారీ నడిపి, ప్రమాదానికి కారకుడైన లారీ డ్రైవర్ వివేక్ విజయ్ కరన్వర్ కు 7 రోజుల సాధారణ జైలుశిక్ష విధించినట్లుగా జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ తెలిపారు.