BREAKING
మాచర్లలో ఎమ్మెల్యే జూలకంటి, ఎంపీ లావు విస్తృత ప్రచారం ఇజ్రాయెల్ అరబ్ పార్టీలపై విరుచుకుపడుతున్న ప్రధాని బెంజమిన్ నెతన్యాహు! పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పణితి రవికుమార్ పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి దాత విజనరీ, డైనమిక్ నాయకుడు రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని పరమావధిగా భావించే నాయకుడు మన ప్రియతమ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మన రాష్ట్రం అభివృద్ధిలో నేడే సామాజిక పెన్షన్ల పంపిణీ....... పొన్నూరు మున్సిపల్ కమిషనర్ ఎం రమేష్ బాబు యూరప్ అంతటా జెన్-జెడ్ నిరసనల హోరు ట్రిలియన్ పారామీటర్లతో శక్తివంతమైన 'మిస్ట్రల్ లార్జ్ 4' ఏఐ మోడల్‌ను విడుదల చేసిన ఫ్రెంచ్ స్టార్టప్! వాటర్ సప్లయ్ స్కీమ్ కార్మికులకు శుభవార్త.. అధికారికంగా అడ్మినిస్ట్రేషన్ నోటీసు జారీ చేసిన ప్రముఖ సంస్థ పౌండ్‌ల్యాండ్! రైల్వే వంతెన నిర్మాణానికి ఐక్యంగా పోరాడాలి తిరుపతి 23వ డివిజన్ కార్పొరేటర్ గా అమృతలక్ష్మినీ భారీ మెజారిటీతో గెలిపించాలి................తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ఫ్రాన్స్ రుణా సంక్షోభం నివాస ప్రాంతంలో 100 కిలోల టపాసుల అక్రమ నిల్వ.. ఇద్దరి అరెస్ట్ గుంతలమయంగా ఘనపూర్ గేటు–చేల్లాపూర్ రోడ్డు.. నూతన రోడ్డు నిర్మించాలి: బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ గడుసు మహిపాల్ వలేరు రూతమ్మను గెలిపించండి శ్రీ షిరిడి సాయి మందిరంలో సంకష్టహర చతుర్థి వ్రతం.. భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు.. వ్రతంలో పాల్గొన్న భక్తులు

మళ్లీ అల్పపీడనం

Select Suryaa Now
మళ్లీ అల్పపీడనం

బాపట్ల, మేజర్ న్యూస్:

దక్షిణ అండమాన్ సముద్రం, పరిసర ప్రాంతాలపై అల్పపీడనం ఏర్పడిందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది రాబోయే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ అండమాన్ సముద్రం, ఆనుకుని ఉన్న నికోబార్ దీవులపై సుస్పష్టమైన అల్పపీడనంగా ( Well Marked Low Pressure ) మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. *శనివారం* ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్ర ప్రాంతాల్లో *వాయుగుండంగా* బలపడే అవకాశం ఉందని వెల్లడించారు. దీని ప్రభావంతో ఆది, సోమవారాల్లో కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని తెలిపారు.

భారీ వర్షాలతో *వంశధార, నాగావళి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నందు* నదీ పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పొంగిపొర్లే కాలువలు, వాగులు దాటే ప్రయత్నం , నది ఈతకు వెళ్ళడం లాంటివి చేయరాదని హెచ్చరించారు.

*రానున్న నాలుగు రోజులు వాతావరణం క్రింది విధంగా ఉండనున్నట్లు ఎండీ ప్రఖర్ జైన్ వివరించారు.*

*శుక్రవారం (30-10-2026)*  అల్లూరి, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ; మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా కురిసే అవకాశం ఉందన్నారు.

*శనివారం (31-10-2026)*  విజయనగరం, కృష్ణా, నంద్యాల, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ; మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

*ఆదివారం (01-11-2026)*   కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు , పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అల్లూరి, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, నెల్లూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

*సోమవారం (02-11-2026)*  పోలవరం జిల్లాలో భారీ వర్షాలు, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు.

గురువారం సాయంత్రం 5 గంటల నాటికి  శ్రీకాకుళం జిల్లా పలాసలో 40.7మిమీ, కంచిలిలో 27మిమీ, మందసలో 24.5మిమీ, ఇచ్ఛాపురంలో 23.7మిమీ, పిన్నింటిపేటలో 17మిమీ చొప్పున వర్షపాతం రికార్డైందన్నారు.