ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించండి ఎస్పీని కలిసి వివరించిన వైసీపీ, సీపీఐ నేతలు
అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్ :అనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్పీ జగదీష్‌ను కలిసి, ఎన్నికలు ప్రశాంతంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగేలా చర్యలు తీసుకోవాలని అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి, వైసీపీ మేయర్ అభ్యర్థి సి.రమేష్ గౌడ్, సీపీఐ జాయింట్ సెక్రటరీ రాజారెడ్డి తెలిపారు. వైసీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామిరెడ్డి, వైసీపీ నగర మేయర్ అభ్యర్థి రమేష్, సీపీఐ జాయింట్ సెక్రటరీ రాజారెడ్డితో కలిసి పార్టీ నాయకులు ఎస్పీని కలిశారు. గత పది రోజులుగా, ప్రత్యేకంగా ఓటింగ్ ముందు రోజుల్లో నగరంలో నెలకొన్న పరిస్థితులపై వారు ఎస్పీకి వివరించారు. వైసీపీ నాయకులు, పార్టీ కార్యకర్తలపై పోలీసులు బైండోవర్లు విధిస్తున్నారని, ప్రముఖ నాయకులు, ఏజెంట్లు, అభ్యర్థులను కూడా లక్ష్యంగా చేస్తున్నారని ఆరోపించారు. కొందరికి ఫోన్ కాల్స్ ద్వారా బెదిరింపులు జరుగుతున్నాయని, ఇలాంటి చర్యలు ఎన్నికల ప్రక్రియపై ప్రభావం చూపుతాయని వాదించారు.
రిపోర్టర్ : మొయినుద్దీన్ అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్