కౌంటింగ్ సెంటర్ ను పరిశీలించిన అబ్జర్వర్ తేజ్ పాల్
బొబ్బిలి, సూర్య : 2వ పురపాలక సంఘ సాధారణ ఎన్నికలలో భాగంగా పురపాలక సంఘ కార్యాలయంలో కౌంటింగ్ సిబ్బందికి ఏర్పాటు చేసిన ట్రైనింగ్ కార్యక్రమంలో పాల్గొన్న జనరల్ అబ్జర్వర్ శ్రీ ఎన్. తేజ్ భరత్, ఐ.ఏ.యస్. గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కౌంటింగ్ సిబ్బందికి జరుగుతున్న ట్రైనింగ్ కార్యక్రమంలో పాల్గొన్న జనరల్ అబ్జర్వర్ శ్రీ ఎన్. తేజ్ భరత్, ఐ.ఏ.యస్ సిబ్బందికి ఏ విధంగా కౌంటింగ్ నిర్వహించాలో సూచనలు జారీ చేశారు. మరియు కౌంటింగ్ విషయంలో వారికి తలెత్తిన అనుమానాలను నివృత్తి చేశారు. తదుపరి యుద్దస్తంభం వద్ద ఏర్పాటుచేసిన స్టాటిక్ సర్వేయలెన్స్ టీమ్ ను సందర్శించి వారికి సూచనలు జారీ చేశారు. తదుపరి ఆర్డిఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేయబడిన రిసెప్షన్ కౌంటర్, డిస్ట్రిబ్యూషన్ కౌంటర్, స్ట్రాంగ్ రూమ్ మరియు కౌంటింగ్ హాల్లను పరిశీలించి సూచనలు జారీ చేశారు. ఈ పర్యటనలో ఉప ఎన్నికల అధికారి మరియు ఆర్డీవో బొబ్బిలి మరియు సహాయక ఎన్నికల అధికారి మరియు మున్సిపల్ కమిషనర్ పాల్గొన్నారు.