పబ్బారెడ్డి ఎన్నికల ప్రచారం.... జోరుగా..... హుషారుగా.
ముత్తుకూరు , మేజర్ న్యూస్ : నారికేల్లపల్లి ఎంపిటిసి స్థానం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పబ్బారెడ్డి శ్రీకృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారాన్ని జోరుగా హుషారుగా సాగిస్తున్నారు. బుధవారం ఆ పంచాయతీ పరిధిలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఆయనతో పాటు పార్టీ కార్యకర్తలు నాయకులు ఉన్నారు. సుదీర్ఘకాలంగా తమ కుటుంబం ప్రజాసేవకే అంకితమైందని మంచితప్ప ఇంకేమి తెలియని తనకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఇంటింటి ప్రచారంలో ఓటర్లను కోరారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సహకారంతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని ఆయన ఓటర్లకు వివరించారు. ఈ సందర్భంగా కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.