వైసీపీ లో అభివృద్ధి అజెండాగా.... మెట్టా ఎన్నికల ప్రచారం.
ముత్తుకూరు, మేజర్ న్యూస్ : గత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలనలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి, అప్పటి రాష్ట్ర మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పరిపాలనలోనారికేళ్ళపల్లి ,డమ్మాయి పాలెం గ్రామాల్లో జరిగిన అభివృద్ధిని అజెండాగా చేసుకుంటూ ఎన్నికల ప్రచారాన్ని స్థానిక ఎంపీటీసీ అభ్యర్థి మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి జోరుగా సాగిస్తున్నారు. బుధవారం ఆయన డమ్మాయిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని బీసీ కాలనీ, దళితవాడ, పోతునాయుడు దిబ్బ తదితర గ్రామాల్లో ఇంటింటి ప్రచారం చేశారు. ఓటర్లకు కరపత్రాలు వచ్చి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మెట్టా ప్రచారానికి ఓటర్ల నుంచి సానుకూల స్పందన లభించింది. ఆ పార్టీ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, పాముల శ్రీనివాసులు, దయాకర్ రెడ్డి, కోదండరామిరెడ్డి, విశ్వ మోహన్ రెడ్డి, పార్టీ కార్యకర్తలు ఆయన వెంట నడిచారు. కూటమి ప్రభుత్వ పరిపాలనలో ప్రభుత్వ వైఫల్యాలను ఎంపీటీసీ అభ్యర్థి తరఫున కార్యకర్తలు ప్రజలకు వివరించారు. స్థానిక ఎన్నికలు చాలా కీలకమని ఓటర్లు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తీర్పు ఇవ్వాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు