ఆత్మకూరులో అదిరిన నారీభేరి ర్యాలీ --వేలాదిగా పాల్గొన్న మహిళలు
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం సాయంత్రం ఆత్మకూరుపట్టణంలో కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన నారిభేరి ర్యాలీ అత్యంత ఘనంగా కోలాహలంగా ఆకర్షణీయంగా సాగింది. వేలాదిగా పాల్గొన్న మహిళలు, తెలుగుదేశం, బిజెపి, జనసేన పార్టీల జండాల రెపరెపలు, బాణాసంచా మోతలు, కోలాటం నృత్యాలతో ఈ ర్యాలీ సాగింది. స్థానిక సత్రం సెంటర్ నుండి వైశ్య బజార్, మెయిన్ బజార్, మున్సిపల్ బస్టాండ్ సెంటర్, జె ఆర్ పేట మీదుగా బిఎస్ఆర్ సెంటర్ వరకు ఈ నారీ భేరి ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ టిడిపి అభ్యర్థి డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కుమార్తె ఆనం కైవల్యా రెడ్డి, పలువురు తెలుగుదేశం నాయకులు ప్రసంగించారు. ఆత్మకూరు అభివృద్ధి ప్రదాత ఆనం రామనారాయణరెడ్డి ఆశీస్సులతో ఆత్మకూరు మున్సిపల్ పరిధిలో తెలుగుదేశం మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా, 25 వార్డుల్లో తెలుగుదేశం తరఫున పోటీ చేస్తున్న మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థులు,మిగతా మూడు వార్డుల్లో పోటీ చేస్తున్న బిజెపి, జనసేన మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థులకు సైకిల్, కమలం, గాజు గ్లాసు గుర్తులపై ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో అఖండ విజయం చేకూర్చాలని వారు ప్రజలను కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,యువ నేతల నారా లోకేష్ లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తూ అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్నారని, అదేవిధంగా ఆత్మకూరు నియోజకవర్గంలో ఆత్మకూరు మున్సిపాలిటీలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అత్యధికంగా నిధులు సాధిస్తూ అభివృద్ధి పరుస్తూ అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందేలా చూస్తున్నారని, మంత్రి ఆనం ఆశీస్సులతో పోటీ చేసిన మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థి డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా, వార్డుల్లో పోటీ చేస్తున్న తెలుగుదేశం, బిజెపి,జనసేన అభ్యర్థులకు అందరూ ఓట్లు వేసి ఘన విజయం చేకూర్చాలని, అధిక మెజార్టీతో అఖండ విజయం చేకూర్చాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం అధ్యక్షుడు తుమ్మల చంద్రారెడ్డి,రాష్ట్ర తెలుగు మహిళ నాయకురాలు పులిమి శైలజా రెడ్డి,వార్డుల్లో కౌన్సిలర్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారు, తెలుగుదేశం నాయకులు కాటంరెడ్డి రవీందర్ రెడ్డి చల్లా రవి కుమార్ రెడ్డి, డాక్టర్ కే అరుణమ్మ, డాక్టర్ బొమ్మిరెడ్డి గీతికారెడ్డి, వేలాదిగా మహిళలు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.