ఎన్నికలు సజావుగా సమర్ధవంతంగా నిర్వహించాలి
చీపురుపల్లి, సూర్య : స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా సమర్ధవంతంగా నిర్వహించాలని డీడీఓ, జిల్లా ట్రైనింగ్ నోడల్ అధికారి కొత్తకోట హేమసుందరరావు సూచించారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహిస్తున్న ఎన్నికల పీఓ, ఏపిఓలు శిక్షణ కార్యక్రమాన్ని ఆయన గురువారం సందర్శించారు. ఎన్నికలు సమర్ధవంతంగా నిర్వహించడానికి పిఓ, ఏపీవో లు పూర్తిస్థాయి లో శిక్షణ పొంది, నేర్చుకొని, ఎన్నికల రోజు జాగ్రత్తగా ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. పోలింగ్ కు ముందురోజు, పోలింగ్ రోజు, పోలింగ్ అనంతరం ఏమేమి చేయాలో శిక్షణలో నేర్చుకొని అమలు చేయాలని తెలియజేశారు. శిక్షణలో తహసీల్దార్ బి సంతోష్ కుమార్, ఏవో టి ప్రవీణ్, డిప్యూటీ ఎంపిడిఓ అప్పలనాయుడు, పీఓలు 61, ఏపీవో లు 61 మంది శిక్షణలో పాల్గొన్నారు.