BREAKING
14 మంది శ్లోకా విద్యార్థులకు స్కాలర్షిప్.. కరస్పాండెంట్ బండి నవనీశ్వర్ రెడ్డి పోగొట్టుకున్న మొబైల్‌ ఫోన్‌ బాధితుడికి అప్పగింత బోరు బావుల ఆక్రమణతో నీటి ఇబ్బందులు చేతిపంపులకు మరమ్మతులు చేపట్టాలి. : మాచర్ల : కూటమిదే విజయం : జనసేన నాయకులు తెలుగుదేశం పార్టీకి షాక్.. తలారి రంగయ్య ఆధ్వర్యంలో వైఎస్ఆర్సిపి తీర్థం పుచ్చుకున్న కార్యకర్త శ్రీనివాసులు. గ్రామాలలో మొదలైన ఎన్నికల ప్రచారం..! డంపింగ్ యార్డ్ డీపీఆర్ ఇవ్వండి.. నిధులు తేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా: సీఎం రేవంత్‌కు ఎంపీ ఈటల సవాల్ వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులకు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశాలు స్వచ్ఛమైన నీటిని తాగాలి.. నీటిని పొదుపుగా వినియోగించాలి: సర్పంచ్ సువర్ణ ప్రభాకర్ రెడ్డి అద్దంకి నియోజకవర్గ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట. నియోజకవర్గ పరిశీలకులు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు. అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్. ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి అభివృద్ధి దిశగా ముందుకు సాగుదాం - ఎమ్మెల్యే ముత్తుముల మున్సిపల్ ఎన్నికల సమగ్ర నిర్వహణ, రూట్ ఆఫీసర్ల విధులు, రవాణా మరియు ఓటింగ్ విధానంపై ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారి మార్గదర్శకాలు పోక్సో చట్టంపై న్యాయ అవగాహన పోస్టర్ ఆవిష్కరణ

బహుదా నది వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్,ఎస్పీ.

Select Suryaa Now
బహుదా నది వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్,ఎస్పీ.

శ్రీకాకుళం, సూర్య  : తుఫాన్ ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాతో పాటు ఎగువ ప్రాంతమైన ఒడిశా రాష్ట్రంలో విస్తృతంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో బహుదా నది వరద నీరు ఇచ్చాపురం పరిధిలోని కొజ్జిరియా (బెళ్ళుపడ) టోల్ గేట్ సమీపంలో పేటూరు వద్ద జాతీయ రహదారిపైకి చేరుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి గురువారం క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితులను పరిశీలించారు. అక్కడ డ్రోన్ కెమెరాల ద్వారా వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ,జాతీయ రహదారిపై ప్రస్తుత పరిస్థితులను సమీక్షించారు. వాహనదారులు, ప్రయాణికుల భద్రతకు అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.పోలీసు, రెవెన్యూ, ఇతర సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలని స్పష్టం చేశారు.వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తూ, రహదారిపై ప్రమాదాలు జరగకుండా తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు.వరద నీరు ప్రవహిస్తున్న రహదారులపై ప్రయాణించవద్దని, నీటి లోతు, ప్రవాహ వేగాన్ని అంచనా వేయలేని పరిస్థితుల్లో వాహనాలతో దాటేందుకు ప్రయత్నించవద్దని జిల్లా కలెక్టర్, ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.అనవసర ప్రయాణాలను నివారించాలని, అత్యవసర పరిస్థితుల్లో అధికారులు హెచ్చరికలను తప్పనిసరిగా పాటిస్తూ, వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.వరద ముప్పు పెరిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో అధికారులు సూచించినప్పుడు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని, అత్యవసర పరిస్థితులు ఎదురైతే వెంటనే పోలీసు లేదా రెవెన్యూ అధికారులకు సమాచారం అందించాలని కోరారు.