టిడిపి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి
నగరం, మేజర్ న్యూస్:
కూటమి పార్టీలు బలపర్చిన టిడిపి నగరం జడ్పిటిసి అభ్యర్థి చింతల సుబ్బారావు, నగరం ఎంపీటీసీ అభ్యర్థి మోర్ల స్వరూపరాణిలను అధిక మెజార్టీతో గెలిపించాలంటూ మండల కేంద్రమైన నగరం శివారు కాపులపాలెం, మాన్యంవారిపాలెం గ్రామాల్లో గురువారం ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. తొలుత నగరంలోని రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, బైక్ ర్యాలీగా ప్రచారంలో పాల్గొన్నారు. ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించుటలో కూటమి ప్రభుత్వం ముందుందని, నవంబర్ 5న జరిగే జడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి సుబ్బారావు, స్వరూపరాణిలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలంటూ ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు పీవీ చింతారావు, మాన్యం నాగమణి, లుక్కా గుడారంకయ్య, వెంకట సుబ్బారావు, ఉప్పాల చెన్నకేశవులు, సమ్మెట శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు