ఎల్‌నినో ప్రభావాల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి – వ్యవసాయ అధికారుల సూచన..
సూర్య బోయినపల్లి.. ఎల్‌నినో ప్రభావాల కారణంగా వర్షపాతంలో మార్పులు, వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండి, వ్యవసాయ శాఖ సూచించిన పంట యాజమాన్య పద్ధతులను పాటించాలని అధికారులు సూచించారు. బోయినపల్లి మండలం దుండ్రపల్లి గ్రామంలో నిర్వహించిన రైతుల అవగాహన కార్యక్రమంలో భాగంగా వాతావరణ మార్పుల నేపథ్యంలో పంటలను కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ జంగం అంజయ్య, మండల ప్రత్యేక అధికారి శరత్ బాబు, తహసీల్దార్ షరీఫొద్దీన్, ఎంపీడీఓ శ్రీధర్ గౌడ్,మండల వ్యవసాయ అధికారి ప్రణిత, వ్యవసాయ విస్తరణ అధికారి లక్ష్మణ్, ఇరిగేషన్ ఏఈ, విద్యుత్ శాఖ ఏఈ తదితరులు రైతులకు పలు సూచనలు చేశారు.
.