క్రీడలతో ఏకాగ్రత, శారీరక సమతుల్యత పెరుగుతాయి: డాక్టర్ నరేందర్ రెడ్డి
రోలర్ స్కేటింగ్ రాష్ట్రస్థాయి పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థి ఎంపిక
సూర్య కరీంనగర్: క్రీడలు విద్యార్థులకు ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించడంతో పాటు ఏకాగ్రత, శారీరక సమతుల్యతను పెంపొందిస్తాయని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డి అన్నారు. కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో నిర్వహించిన అభినందన సభలో ఆయన మాట్లాడారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో నిర్వహించిన జోనల్ స్థాయి రోలర్ స్కేటింగ్ పోటీల్లో తొమ్మిదో తరగతి విద్యార్థి పి.శ్రీహాస్ అండర్-15 విభాగంలో ప్రతిభ కనబరిచి, నవంబర్ 10, 11, 12 తేదీల్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా శ్రీహాస్‌ను డాక్టర్ నరేందర్ రెడ్డి అభినందించి, రాష్ట్రస్థాయి పోటీల్లోనూ విజయం సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.