BREAKING
మల్లన్నసాగర్ కట్టకింద భారీ బ్లాస్టింగ్ 35 వేల ఎకరాల్లో పంట నష్టం.. రైతులకు అండగా కూటమి ప్రభుత్వంప్రతిపక్షాల విమర్శలు విడ్డూరం : ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మక్కువ లో హోరెత్తిస్తున్న ప్రధాన పార్టీల ప్రచారం ​బోగోలు మండలంలో ముమ్మరంగా ప్రచారం - జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను భారీగా గెలిపించాలంటూ ఎమ్మెల్యే ఆత్మకూరులో అదిరిన నారీభేరి ర్యాలీ --వేలాదిగా పాల్గొన్న మహిళలు బహుదా నది వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్,ఎస్పీ. టిడిపి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీలకు వెంకటేశ్వరి ఎంపిక 14 వ వార్డు లో దూసుకుపోతున్న కాకి గంగరాజు * మద్దతుగా వెలగపూడి ప్రతాపరుద్ర * నాటుసారా, అక్రమ మద్యం రవాణా నియంత్రణకు ఆంధ్రప్రదేశ్–ఒడిశా అధికారుల సమన్వయ సమావేశం అమెరికన్ బౌద్ధ భిక్షువుకు అంతర్జాతీయ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త పురస్కారం ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి బండి దీప్తిని భారీ మెజార్టీతో గెలిపించండి ఏయూ పరిశోధకురాలికి కేంద్ర సంగీత నాటక అకాడమీ ‘ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం’ ఏపీ ఉన్నత విద్యా ఫీజుల నియంత్రణ కమిటీ సభ్య కార్యదర్శిగా డా. ఎస్. కృష్ణయ్య నియామకం.. మూడేళ్ల పాటు డిప్యుటేషన్‌పై బాధ్యతలు అక్కంపల్లి వైసిపి, సిపిఐ ఎంపీటీసీ అభ్యర్థి గౌని శారద గెలుపు కోసం విస్తృత ప్రచారం

రైతులకు మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలి – జిల్లా కలెక్టర్

Select Suryaa Now
రైతులకు మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలి – జిల్లా కలెక్టర్

నెల్లూరు,  మేజర్ న్యూస్ :   నెల్లూరు జిల్లా కలెక్టరేట్‌లోని శంకరన్ హాల్‌లో బుధవారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన అగ్రిస్టాక్  కార్యక్రమం అమలు, డిజిటల్ వ్యవసాయ సమాచార సమీకరణ, రైతులకు మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించే అంశాలపై జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్  సమావేశం విజయవంతంగా నిర్వహించారు.  ఈ సమావేశంలో గౌరవనీయ జిల్లా కలెక్టర్ గారు,జాయింట్ కలెక్టర్గారు,ముఖ్య ప్రణాళిక అధికారి, లీడ్ బ్యాంక్ మేనేజర్, ఐటీడీఏ అధికారులు, జిల్లా వ్యవసాయ అధికారి,  పి. సత్యవాణిగారు,జిల్లా ఉద్యానవన శాఖ అధికారి, సుబ్బారెడ్డి , డీడీఏ, డీఆర్‌సీ V. సుమలత,  వ్యవసాయ పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డా. వినీత,  జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయ సహాయ వ్యవసాయ సంచాలకులు D. సుజాత మరియు జిల్లాలోని అన్ని సహాయ వ్యవసాయ సంచాలకులు, ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.  సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి అగ్రిస్టాక్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాలు, అమలు విధానం, వ్యవసాయ రంగంలో దాని ఉపయోగాలు, రైతులకు కలిగే ప్రయోజనాలను వివరించారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన వివిధ శాఖల సమాచారాన్ని సమన్వయం చేసి, డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించడం ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందించవచ్చని తెలిపారు.  అగ్రిస్టాక్ కార్యక్రమంలో భాగంగా గుర్తించిన తొమ్మిది ప్రధాన అంశాలపై అధికారులతో చర్చించారు.  వీటిలో వ్యవసాయ సమాచార నాణ్యత, భూముల వివరాల అనుసంధానం, రైతుల గుర్తింపు, ప్రభుత్వ పథకాల అమలు, పంటల ప్రణాళిక, పంటల పర్యవేక్షణ, పంటల బీమా, వ్యవసాయ మార్కెటింగ్, వ్యవసాయ రుణాలు, వ్యవసాయ గణాంకాలు, సమగ్ర వ్యవసాయ విలువ గొలుసు ప్రణాళిక, వినూత్న డిజిటల్ విధానాల ద్వారా రైతులకు ప్రయోజనం చేకూర్చడం వంటి అంశాలు ఉన్నాయి. ప్రాంతాల వారీగా, పంటల వారీగా రైతుల సమాచారాన్ని సమన్వయం చేయాలి  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని ప్రాంతాల వారీగా, రైతుల వారీగా, పంటల వారీగా సమగ్ర వ్యవసాయ సమాచారాన్ని రూపొందించి, వ్యవస్థీకృత రిటైలర్లతో రైతులను అనుసంధానం చేయాలని అధికారులకు సూచించారు.  జిల్లాలో ప్రధానంగా సాగు చేస్తున్న పప్పుధాన్యాలు, కూరగాయలు, పండ్లు, వేరుశనగ వంటి వ్యవసాయ ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ అవకాశాలు కల్పించే దిశగా చర్యలు చేపట్టాలని తెలిపారు. రైతులు పండించిన ఉత్పత్తులకు తగిన మార్కెట్ సౌకర్యాలు కల్పించడంతో పాటు, వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్, విలువ జోడింపు, మార్కెట్ అనుసంధానం వంటి అవకాశాలను గుర్తించి కార్యాచరణ రూపొందించాలని సూచించారు.  

రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా అంతరశాఖల సమన్వయం 
అగ్రిస్టాక్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి వ్యవసాయ శాఖతో పాటు సంబంధిత అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. జిల్లాలోని వాస్తవ వ్యవసాయ సమస్యలను గుర్తించి, అందుబాటులో ఉన్న సమాచారాన్ని వినియోగిస్తూ రైతులకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూర్చే ఆచరణ సాధ్యమైన ప్రతిపాదనలు రూపొందించాలని తెలిపారు.  డిజిటల్ వ్యవసాయ సమాచారాన్ని సమర్థవంతంగా వినియోగించడం ద్వారా వ్యవసాయ ప్రణాళికను మెరుగుపరచడం, పంటల ఆధారంగా మార్కెటింగ్ అవకాశాలను గుర్తించడం, వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడించడం, రైతులకు మెరుగైన సేవలు అందించడం వంటి లక్ష్యాలను సాధించేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు తమ తమ శాఖలకు సంబంధించిన వ్యవసాయ సమాచారాన్ని సమన్వయం చేసుకుంటూ, అగ్రిస్టాక్ కార్యక్రమం ద్వారా రైతులకు మెరుగైన ప్రయోజనాలు అందించే దిశగా పనిచేయాల్సిన అవసరాన్ని వివరించారు.సమావేశం అనంతరం వ్యవసాయా శాఖ అధికారులు మరియు ARS శాస్త్రవేత్తలు నెలవారీ సమీక్షా సమావేశం జరిగింది