BREAKING
అమెరికన్ బౌద్ధ భిక్షువుకు అంతర్జాతీయ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త పురస్కారం ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి బండి దీప్తిని భారీ మెజార్టీతో గెలిపించండి ఏయూ పరిశోధకురాలికి కేంద్ర సంగీత నాటక అకాడమీ ‘ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం’ ఏపీ ఉన్నత విద్యా ఫీజుల నియంత్రణ కమిటీ సభ్య కార్యదర్శిగా డా. ఎస్. కృష్ణయ్య నియామకం.. మూడేళ్ల పాటు డిప్యుటేషన్‌పై బాధ్యతలు అక్కంపల్లి వైసిపి, సిపిఐ ఎంపీటీసీ అభ్యర్థి గౌని శారద గెలుపు కోసం విస్తృత ప్రచారం ఏపీ నిట్ డైరెక్టర్‌గా ప్రొఫెసర్ కె.వి. కృష్ణారావు భాద్యతలు స్వీకరణ పంట నష్టాలకు పరిహారం ప్రకటించిన ప్రభుత్వం..! ఆర్నబ్ తుఫాను ప్రభావిత పంటలను పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి* రైతులకు శాస్త్రవేత్తల సూచనలు...!! అల్బేనియాలో ఉద్రిక్తతలు.. పార్లమెంట్‌లో ప్రతిపక్ష సభ్యుల తీవ్ర నిరసన మరియు గందరగోళం! తగ్గిన నష్టాలు.. మెరుగైన ఫలితాలు నమోదు చేసిన రెస్టారెంట్ బ్రాండ్స్ ఆసియా! గ్రామపంచాయతీ లలో క్లోరినేషన్ చేసి మంచినీటి సరఫరా చెయ్యాలి.... * డిప్యూటీ ఎంపీడీవో కేకే వర్మ* మూడో త్రైమాసికంలో ఊపందుకున్న అమెరికా ఆర్థిక వృద్ధి..! ప్రచార జోరులో జనసేన ... * గ్లాసు గుర్తు కే మీ ఓటు * అంతర్జాతీయ మార్కెట్లలో టెక్నికల్ ట్రెండ్స్..!

ఎమ్మెల్యే బీవీ సమక్షంలో 80 మంది టీడీపీలో చేరిక

Select Suryaa Now
ఎమ్మెల్యే బీవీ  సమక్షంలో  80 మంది టీడీపీలో  చేరిక

ఎమ్మిగనూరు,సూర్య ప్రతినిధి :ఎమ్మిగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలోకి దూదేకుల సంఘం సభ్యులు చేరారు. సిరాలదొడ్డి, రాళ్లదొడ్డి, ముగతి, నందవరం గ్రామాలకు చెందిన సిరాలదొడ్డి ఖాజా, దూదేకుల మన్సూర్‌తో పాటు వారి అనుచరులు సుమారు 80 మంది ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై విశ్వాసంతో తాము టీడీపీలో చేరినట్లు వారు పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని పార్టీలో చేరిన వారు తెలిపారు. ఈ చేరికతో ఆయా గ్రామాల్లో పార్టీ కార్యకలాపాలకు మరింత ఊతం లభిస్తుందని టీడీపీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేశాయి.

A. R. శరత్ కుమార్ సూర్య ప్రతినిధి, ఎమ్మిగనూరు కర్నూలు జిల్లా