BREAKING
35 వేల ఎకరాల్లో పంట నష్టం.. రైతులకు అండగా కూటమి ప్రభుత్వంప్రతిపక్షాల విమర్శలు విడ్డూరం : ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మక్కువ లో హోరెత్తిస్తున్న ప్రధాన పార్టీల ప్రచారం ​బోగోలు మండలంలో ముమ్మరంగా ప్రచారం - జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను భారీగా గెలిపించాలంటూ ఎమ్మెల్యే ఆత్మకూరులో అదిరిన నారీభేరి ర్యాలీ --వేలాదిగా పాల్గొన్న మహిళలు బహుదా నది వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్,ఎస్పీ. టిడిపి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీలకు వెంకటేశ్వరి ఎంపిక 14 వ వార్డు లో దూసుకుపోతున్న కాకి గంగరాజు * మద్దతుగా వెలగపూడి ప్రతాపరుద్ర * నాటుసారా, అక్రమ మద్యం రవాణా నియంత్రణకు ఆంధ్రప్రదేశ్–ఒడిశా అధికారుల సమన్వయ సమావేశం అమెరికన్ బౌద్ధ భిక్షువుకు అంతర్జాతీయ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త పురస్కారం ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి బండి దీప్తిని భారీ మెజార్టీతో గెలిపించండి ఏయూ పరిశోధకురాలికి కేంద్ర సంగీత నాటక అకాడమీ ‘ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం’ ఏపీ ఉన్నత విద్యా ఫీజుల నియంత్రణ కమిటీ సభ్య కార్యదర్శిగా డా. ఎస్. కృష్ణయ్య నియామకం.. మూడేళ్ల పాటు డిప్యుటేషన్‌పై బాధ్యతలు అక్కంపల్లి వైసిపి, సిపిఐ ఎంపీటీసీ అభ్యర్థి గౌని శారద గెలుపు కోసం విస్తృత ప్రచారం ఏపీ నిట్ డైరెక్టర్‌గా ప్రొఫెసర్ కె.వి. కృష్ణారావు భాద్యతలు స్వీకరణ

ఆసుపత్రి పరిశుభ్రత ప్రతి ఒక్కరి సమిష్టి బాధ్యత

Select Suryaa Now
ఆసుపత్రి పరిశుభ్రత ప్రతి ఒక్కరి సమిష్టి బాధ్యత

రాజమహేంద్రవరం, అక్టోబర్ 27:

రోగుల ఆరోగ్య పరిరక్షణ, ఆసుపత్రుల్లో పారిశుధ్యం–పరిశుభ్రత ప్రమాణాల పెంపు, అంటువ్యాధుల నివారణ లక్ష్యంగా రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాలలో కాయకల్ప (Kayakalp – Sanitation & Hygiene) అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME), ఆంధ్రప్రదేశ్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

కార్యక్రమంలో వైద్యులు, కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది, వైద్య విద్యార్థులకు ఆసుపత్రి పరిశుభ్రత ప్రాధాన్యత, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ, చేతుల పరిశుభ్రత, ఇన్ఫెక్షన్ నియంత్రణ చర్యలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎం.ఎస్. రాజు మాట్లాడుతూ.. కాయకల్ప కార్యక్రమం లక్ష్యాలను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని, వాటిని విధి నిర్వహణలో భాగంగా ఆచరించాలని సూచించారు. ఆసుపత్రి పరిశుభ్రత కేవలం పారిశుధ్య సిబ్బంది బాధ్యత కాదని, వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది, వైద్య విద్యార్థులు సహా ప్రతి ఒక్కరి సమిష్టి బాధ్యత అని పేర్కొన్నారు.

పరిశుభ్రమైన ఆసుపత్రి వాతావరణం రోగులకు సురక్షితమైన వైద్య సేవలు అందించడంతోపాటు, ఆసుపత్రుల్లో వ్యాపించే ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. పురాతన హరప్పా, మొహెంజోదారో నాగరికతల్లోనే ప్రణాళికాబద్ధమైన పట్టణ నిర్మాణం, మురుగునీటి పారుదల వ్యవస్థలకు ప్రాధాన్యత ఇచ్చారని గుర్తుచేశారు.

“ఇంటిని చూసి ఇల్లాలిని చూడు.. ఆసుపత్రిని చూసి అక్కడి పారిశుధ్యాన్ని చూడు” అనే నానుడి తరహాలో ఆసుపత్రి పరిశుభ్రత ఆ సంస్థ అందించే సేవల నాణ్యతను, ప్రజల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని డా. ఎం.ఎస్. రాజు పేర్కొన్నారు.

మైక్రోబయాలజీ విభాగం హెచ్‌ఓడీ డా. ఎం. భారతి మాట్లాడుతూ.. ఆసుపత్రుల్లో ఇన్ఫెక్షన్ల నియంత్రణకు బయోమెడికల్ వ్యర్థాలను వాటి వర్గీకరణకు అనుగుణంగా వేర్వేరుగా సేకరించి, నిర్దేశిత విధానాల ప్రకారం సురక్షితంగా పారవేయడం అత్యంత అవసరమని వివరించారు. అపరిశుభ్రమైన చేతుల ద్వారా సూక్ష్మజీవులు వ్యాపించి రోగులు, సిబ్బందికి ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఉందని తెలిపారు. సరైన సమయంలో శాస్త్రీయ పద్ధతిలో చేతులు శుభ్రం చేసుకోవాలని సూచిస్తూ, చేతుల పరిశుభ్రత విధానాలను ప్రదర్శించారు.

పాథాలజీ విభాగం హెచ్‌ఓడీ డా. బి. కిరణ్మయి మాట్లాడుతూ.. వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ఆరోగ్య పరిరక్షణకు పునాది అని పేర్కొన్నారు. పరిశుభ్రమైన వాతావరణం వ్యాధుల నివారణతోపాటు మానసిక ప్రశాంతతకు కూడా దోహదపడుతుందని తెలిపారు.

కమ్యూనిటీ మెడిసిన్ విభాగం హెచ్‌ఓడీ డా. వి.వి. దుర్గాప్రసాద్ మాట్లాడుతూ.. వైద్యులు, సిబ్బంది తమ వెంట హ్యాండ్ శానిటైజర్ ఉంచుకుని అవసరమైన సందర్భాల్లో వినియోగించాలని సూచించారు. రోగిని తాకడానికి ముందు, తాకిన తర్వాత, రోగి సంరక్షణకు సంబంధించిన కీలక సందర్భాల్లో తప్పనిసరిగా చేతుల పరిశుభ్రత పాటించాలని తెలిపారు.

“పరిశుభ్రత మన అలవాటు కావాలి – ఆరోగ్య పరిరక్షణ మన బాధ్యత కావాలి” అని పిలుపునిచ్చారు.

డా. బి. శ్రీనివాస్ నాయక్ కాయకల్ప కార్యక్రమం ప్రధాన ఉద్దేశాలు, లక్ష్యాలు, అమలు విధానాన్ని వివరించారు. ఆసుపత్రుల్లో పరిశుభ్రత ప్రమాణాల మెరుగుదల, పారిశుధ్య నిర్వహణ, వ్యర్థాల సక్రమ నిర్వహణ, ఇన్ఫెక్షన్ నియంత్రణ, రోగులకు సురక్షితమైన నాణ్యమైన వైద్య సేవలు అందించడం కాయకల్ప కార్యక్రమంలోని ముఖ్య అంశాలని తెలిపారు.

కార్యక్రమంలో భాగంగా కళాశాల ప్రాంగణంలో శుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. సిబ్బంది, విద్యార్థులకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంపై ఆచరణాత్మక అవగాహన కల్పించారు. ఆసుపత్రి, కళాశాల పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అనే సందేశాన్ని అందించారు.

ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, వైద్య విద్యార్థులు, పారిశుధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

– Suryaa News Desk