BREAKING
పోలీస్ స్టేషన్లో  విద్యార్థులకు పోలీస్ విధులపై అవగాహన మార్వెల్ ఫ్యాన్స్‌కు దీపావళి సర్ప్రైజ్.. తెలుగులోనూ ‘అవెంజర్స్ డూమ్స్‌డే’ ముందుగానే విడుదల జెన్నిఫర్ వింగెట్‌తో విభేదాలపై పరిణీతి చోప్రా ఘాటు స్పందన.. పుకార్లను కొట్టిపారేసిన స్టార్ హీరోయిన్లు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులకు యూనిఫారంలు పంపిణీ చేసిన సింగరేణి అధికారుల కొరతతో అభివృద్ధికి ఆటంకం బాలీవుడ్ కంటే హాలీవుడ్‌లోనే ఎక్కువ వైవిధ్యం ఉంది.. నటి ఎల్నాజ్ నౌరోజీ ఆసక్తికర వ్యాఖ్యలు! రామాయణంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకంపై క్లారిటీ ఇచ్చిన నితీష్ తివారీ.. అసలు నిజం ఇదే! క్రీడల్లోనూ మందమర్రి మోడల్ స్కూల్ విద్యార్థిని సత్తా - రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు జీ. అనూ అర్హత మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి - బీజేపీ మండల అధ్యక్షుడు శ్రీధర్ రావు ఈ-వేస్ట్ నిర్వహణపై విద్యార్థులకు అవగాహన - నాలుగు రంగుల వ్యర్థాల సేకరణ డబ్బాల ఏర్పాటు భట్టిప్రోలు పోలీసుల పనితీరు పట్ల హర్షం విద్యార్థులకు పోలీస్ విధులపై అవగాహన డ్యూన్ పార్ట్ 3 ఫైనల్ ట్రైలర్ విడుదల.. పాల్ అట్రేయిడ్స్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఛానీ తిరుగుబాటు! ప్రధాన రహదారిపై ఇసుక వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలు,వాహనదారులు క్రీడలతో ఏకాగ్రత, శారీరక సమతుల్యత పెరుగుతాయి: డాక్టర్‌ నరేందర్‌ రెడ్డి

25 ఏళ్ల తర్వాత అట్లూరు జెడ్పీటీసీ స్థానం టీడీపీ కైవసం

Select Suryaa Now
25 ఏళ్ల తర్వాత అట్లూరు జెడ్పీటీసీ స్థానం టీడీపీ కైవసం

అట్లూరు, మేజర్ న్యూస్:కడప జిల్లా అట్లూరు మండల రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. దాదాపు 25 ఏళ్ల తర్వాత అట్లూరు జెడ్పీటీసీ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. జెడ్పీటీసీగా పొత్తపి నరసింహులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పరిణామంతో మండల రాజకీయాల్లో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. యువకుడిగా, ఉత్సాహవంతుడిగా రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తున్న పొత్తపి నరసింహులుకు జెడ్పీటీసీగా అవకాశం కల్పించడం స్థానికంగా ప్రాధాన్యత సంతరించుకుంది. యువ నాయకత్వానికి పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో బద్వేల్ టీడీపీ ఇన్‌చార్జ్ మంచూరు సూర్యనారాయణరెడ్డి, అట్లూరు మండల టీడీపీ నాయకత్వం ఆయన అభ్యర్థిత్వానికి మద్దతుగా నిలిచారు.

నాయకత్వంపై పెరిగిన అంచనాలు

పొత్తపి నరసింహులు ఏకగ్రీవ ఎన్నికతో అట్లూరు మండలంలో పార్టీ రాజకీయాలకు కొత్త ఊపు వచ్చినట్లయింది. యువ నాయకుడిగా తనదైన శైలిలో ముందుకు సాగుతున్న ఆయనకు జెడ్పీటీసీ బాధ్యతలు దక్కడం మండల అభివృద్ధి విషయంలో ఆయనపై అంచనాలను పెంచుతోంది. ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయడంతోపాటు మండల అభివృద్ధిలో చురుకైన పాత్ర పోషించాల్సిన బాధ్యత ఇప్పుడు ఆయనపై ఉంది. యువ నాయకత్వానికి అవకాశం కల్పించిన టీడీపీ నాయకత్వ నిర్ణయం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా పొత్తపి నరసింహులు ఏకగ్రీవ ఎన్నిక అట్లూరు మండల రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకోగా రానున్న రోజుల్లో ఆయన నాయకత్వం ఎలా ముందుకు సాగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈ సందర్భంగా జడ్పిటిసి పొత్తపి నరసింహులు మాట్లాడుతూ ఎన్నికకు సహకరించిన బద్వేల్ టిడిపి ఇంచార్జ్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి, అట్లూరు మండల టిడిపి నాయకత్వానికి, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. మండల ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు సహకారం అందిస్తానని  ఆయన పేర్కొన్నారు.

సూర్య రిపోర్టర్: ఎ. తిరుపాల్ , అట్లూరు