BREAKING
50 ఏళ్ల మహిళగా వామికా గబ్బి.. గుర్తుపట్టలేనంతగా మేకోవర్! ఉష్ణమండల వ్యాధుల నివారణకు ఉమ్మడి కృషి అవశ్యం: డాక్టర్ అహ్మద్ రాజ‌ధానిలో తాగు నీటి స‌మ‌స్య రాకూడ‌దు .. తాగు నీరు స‌ర‌ఫ‌రా, ఎస్టీపీలపై స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సోలార్ ప్యానెళ్ల ఏర్పాటులో కొండారెడ్డిపల్లి ఆదర్శం దత్తత ప్రక్రియను వేగవంతం చేయాలి! రాష్ట్ర దత్తత సంస్థ కార్యక్రమ నిర్వహణాధికారి సునీత యువత పొగాకు ఉత్పత్తుల కు దూరంగా ఉండాలి -ప్రోగ్రాం అధికారి డాక్టర్ ప్రదీప్ కుమార్ త్రివిక్రమ్ డైలాగులపై శ్రీనిధి శెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆదర్శ కుటుంబం విశేషాలు మంజీర నదిలో తల్లి, ఇద్దరు చిన్నారుల మృతదేహాలు వెలికితీత: ఏడుపాయల వద్ద విషాద ఘటన.. బంధువుల రోదనలు శ్రీ చైతన్య విద్యార్థులకు స్కాలర్షిప్... శ్రీరామ్ ఫైనాన్స్ సంస్థ ద్వారా ఎంపిక కరువు కష్టాలను పక్కదారి పట్టించేందుకే కాంగ్రెస్‌ డైవర్షన్‌ రాజకీయాలు : బిఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ రైతులకు భరోసా.. సహకార సంఘాల వద్దే వడ్లు అమ్మాలి! కందుకూరు మండల వార్డు మెంబర్ల ఫోరం అధ్యక్షుడిగా తాళ్ల కార్తిక్ ఏకగ్రీవ ఎన్నిక టెలివిజన్ తెరపై మొదటిసారిగా మీరా రాజ్‌పుత్ సందడి.. ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో షాహిద్ కపూర్, ఈశాన్ ఖట్టర్ ఉగ్రదాడిని అడ్డుకున్న భారత పైలట్‌కు యూఏఈ అత్యున్నత గౌరవం పెరిగిన ధరలకు అనుగుణంగా హాస్టల్ విద్యార్థులకు నూతన మెనూ అమలు చేయాలి

మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి - బీజేపీ మండల అధ్యక్షుడు శ్రీధర్ రావు

Select Suryaa Now
మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి    - బీజేపీ మండల అధ్యక్షుడు శ్రీధర్ రావు

సూర్య, తంగళ్ళపల్లి: తంగళ్లపల్లి మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని బిజెపి తంగళ్ళపల్లి మండల అధ్యక్షుడు వెన్నమనేని శ్రీధర్ రావు అన్నారు. భారతీయ జనతా పార్టీ తంగళ్లపల్లి మండల అధ్యక్షుడు వెన్నమనేని శ్రీధర్ రావు ఆధ్వర్యంలో మానేరు బ్రిడ్జి వద్ద బుధవారం ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తంగళ్లపల్లి మండలంలో 11/6 ప్యాకేజీ కాలువ పనులను పూర్తి చేయాలని గతంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించినప్పుడు కాలువ పనులు పూర్తి చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, అయితే ఇప్పటివరకు ఆ హామీ నెరవేరలేదని ఆరోపించారు.మండలంలోని రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే తంగళ్లపల్లి మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే రైతులతో కలిసి పెద్ద ఎత్తున నిరసనలు, ధర్నాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సూరుకొంటి తిరుపతి రెడ్డి, మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు గుర్రం అనసూర్య, మహేందర్, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి కోస్ని వినయ్ యాదవ్, జంగం కిషన్, జిందం సంతోష్, నక్క అశోక్, మ్యాకల సురేష్, గొట్టం సందీప్ రెడ్డి, బొజ్జ తిరుపతి, మెహర్ కృష్ణ, కాబోజు సురేష్ తదితరులు పాల్గొన్నారు.