BREAKING
32వ వార్డులో ఫ్యాన్ హోరు - గోల్డ్ ఇస్మాయిల్ కు బ్రహ్మరథం పడుతున్న ప్రజలు బీజేపీ కందుకూరు మండల ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా అంబటి కృష్ణ నీళ్లలో సాహసించి విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించిన సిబ్బంది ఇచ్చిన హామీలకే దిక్కులేదు..మళ్ళీ కొత్త హామిలా మాజీ మేయర్ వసీం మంచాల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి ప్రాణాలకు తెగించి నీళ్లలో దిగి విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ: డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు.. కళ్లద్దాల పంపిణీ ఇజ్రాయెల్ ఎన్నికల్లో ఉత్కంఠ.. నెతన్యాహు మళ్లీ అధికారంలోకి వస్తారా? కుటుంబంతో కలిసి నవ్వుతూ ఎంజాయ్ చేసే సినిమా ఇది.. దొంగ నా కొడుకు సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో హీరో మౌళి కౌసర్ విజయానికి కూటమి బాటలు.. 32వ డివిజన్లో బిజెపి జనసేన టిడిపి నాయకుల విస్తృత ప్రచారం మోదీపై వ్యక్తిగత విమర్శలు సరికాదుః ఖర్గే వ్యాఖ్యలను ఖండించిన బీసీ సంఘాలు 47 ఏళ్ల తర్వాత కలవనున్న దిగ్గజాలు.. నెట్‌ఫ్లిక్స్ మెగావర్స్ షోలో చిరంజీవి, కమల్ హాసన్ సందడి మార్పు దిశగా ప్రపంచ దేశాలు న్యూ నలంద పాఠశాలలో ఈ-వేస్ట్ సేకరణ డ్రైవ్ *కోహెడ మండలంపై మంత్రి పొన్నం ప్రభాకర్‌కు సవతి తల్లి ప్రేమ ఎందుకు రైతుల కష్టాలు ప్రభుత్వానికి కనిపించడం లేదా*

రైతులకు భరోసా.. సహకార సంఘాల వద్దే వడ్లు అమ్మాలి!

Select Suryaa Now
రైతులకు భరోసా.. సహకార సంఘాల వద్దే వడ్లు అమ్మాలి!

కొండాపూర్‌ ; కొండాపూర్‌ మండల పరిధిలోని కొండాపూర్‌, గొల్లపల్లి, తేర్పోల్‌ సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను ఆత్మ కమిటీ చైర్మన్‌ వై. ప్రభు, సీడీసీ చైర్మన్‌ రాంరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభు మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తూ ధాన్యం కొనుగోళ్ల ద్వారా భరోసా కల్పిస్తోందన్నారు.రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం నిర్ణయించిన సహకార సంఘాల కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని సూచించారు. సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ అందిస్తున్నందున రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించడం ద్వారా ప్రభుత్వ మద్దతు ధరతో పాటు వర్తించే బోనస్‌ ప్రయోజనాలను పొందవచ్చని తెలిపారు.

రైతులకు అవసరమైన సౌకర్యాలు

ధాన్యం ఆరబెట్టుకునేందుకు రైతులకు టార్పాలిన్లు అందజేస్తున్నామని ప్రభు తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియను నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ధాన్యం తూకంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా, కొనుగోళ్లు సజావుగా జరిగేలా సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ప్రభుత్వ కొనుగోలు విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమాల్లో కొండాపూర్‌ సొసైటీ సీఈఓ సిరాజ్‌, సొసైటీ చైర్మన్‌ మాణిక్‌రెడ్డి, తలారి రాజు, నరసింహారెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లారెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.